Site icon HashtagU Telugu

Haryana: డాక్టర్ పై కారుతో దాడి చేసిన దుండగులు.. ఆపై ఆగకుండా అలా?

Haryana

Haryana

ఇటీవల కాలంలో తరచూ సోషల్ మీడియాలో కొన్ని ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అందులో కొన్ని సంఘటనలు చూస్తే మాత్రం ఒళ్ళు జలదరించడంతో పాటు వాటిని చూస్తే కొన్ని కొన్ని సార్లు భయమేస్తూ ఉంటుంది. అందులో ఎక్కువగా రోడ్డు యాక్సిడెంట్ కు సంబంధించిన వీడియోలు ఉంటున్నాయి. తాజాగా కూడా అలాంటి ఘటనే ఒకటి హర్యానాలో చోటు చేసుకుంది. కొందరు దుర్మార్గులు ఒక డాక్టర్ ని కారుతో గుద్ది ఆపై 50 మీటర్ల పాటు లాకెళ్ళారు. అసలేం జరిగిందంటే…

డా. గగన్‌ తన కుమారున్ని ట్యూషన్ నుంచి ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో పక్కనే ఉన్న కారు అతన్ని ఢీ కొట్టింది. గగన్‌ కారును ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కారు డోమ్‌పై అతన్ని అలాగే ఉంచి ముందుకు దూసుకెళ్లారు. దాదాపు 50 మీటర్ల వరకు కారుతో పాటు లాక్కెళ్లారు దుండగులు. తీవ్ర గాయాలపాలైన అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఆధారాలతో దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

ఆ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఆ దృశ్యం అంతా వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అధి కాస్త వైరల్ గా మారింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కారు నడిపిన వ్యక్తులపై లిటిజెన్స్ తీవ్ర స్థాయిలో మండిపడడంతో పాటు వెంటనే వారిని కఠినంగా శిక్షించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version