Site icon HashtagU Telugu

Rooster : సూర్యోదయానికి ముందు కోళ్లు ఎందుకు కూస్తాయో తెలుసా..?

Do You Know Why Rooster Crow Before Sunrise

Do You Know Why Rooster Crow Before Sunrise

సిటీల్లో అంటే ఉదయాన్నే నిద్రలేవడం కష్టం అనుకుంటారు కానీ పల్లెటూళ్లలో అయితే తెల్లవారుజామునే అంటే కోడికూసే వేళకే నిద్రలేచి వారి పనులను ఆరంభిస్తారు. కోడి కూతకే నిద్రలేవాలి అనేది ఒక సెంటిమెంట్ గా వాళ్లు భావిస్తారు. ఐతే అసలు కోడి తెల్లవారే టైం కు ఎలా కూస్తుంది. దీని వెనక ఉన్న రీజన్ ఏంటి అని చాలామంది కనుక్కోవాలని అనుకుంటారు.

సూర్యోదయాని (Sunrise)కి ముందు కోడి కూస్తుంది (Rooster Crow). ఐతే దీని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ బయటపడింది. కోడి (Rooster)లోని జీవ గడియారం అదే బయోలాజికల్ క్లాక్ వల్లే అవి కూస్తుంటాయని తెలుస్తుంది. మనిషి కన్నా కోడి 45 నిమిషాల ముందే వెలుతురిని చూస్తుందట. అలా సూర్యోదయం కాబోతుంది అని ముందే కనిపెట్టి కోడి కూస్తుంది.

కోడి కూత వెలుతురు వస్తుందనే సూచికతోనే కూస్తుంది. మాములు టైం కన్నా కోడి తెల్లవారుజామున్నే ఎక్కువ కూస్తుంటాయి. కోడి కూసింది అంటే తెల్లవారినట్టే అని కొందరి ప్రజల నమ్మకం. ఐతే కోడి రాబోయే వెళుతురిని తెలుసుకుంటుంది కాబట్టే కూత పెడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.

మొత్తానికి అలా కోడి కూతకు తెల్లవారుజామున నిద్రలేవడానికి అలా రిలేషన్ కుదిరింది. ఐతే ఇవేవి తెలియని వారు మాత్రం కోడి కూసింది కాబట్టి తెల్లవారింది అనుకుని పల్లెటూళ్లలో పనులు మొదలు పెడతారు.

Also Read : Narendra Modi : గయానా ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను భారతదేశ ప్రజలకు అంకితం చేసిన మోదీ