అదేంటి వెజిటేరియన్ విలేజ్ (Vegetarian Village).. అలాంటి విలేజ్ లు కూడా ఉంటాయా..? అని అనుకుంటున్నారా..? నిజమే మీము చెపుతుంది విలేజ్ పేరు కాదు..ఆ విలేజ్ లో ఉన్న వారంతా పూర్తి శాఖాహారులే. వీరు నాన్ వెజ్ కాదు కనీసం ఉల్లి, వెల్లుల్లి (Onion and Garlic) కూడా తినరు..ఏంటి నమ్మడం లేదా ఇది నిజమే.
ప్రపంచం లో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి..ఆయా ప్రదేశాల్లో ఎన్నో జాతుల ప్రజలు , పలు తెగలకు చెందిన వారు ఉంటారు. వారి ఆచార సంప్రదాయాలు చాల కొత్తగా ఉంటాయి. ప్రపంచం రోజు రోజుకు ఇంతగా డెవలప్ అవుతున్నప్పటికీ వారి ఉరి కట్టబాటులను మాత్రం ఇప్పటికి కొనసాగిస్తూనే ఉంటారు. ఇప్పుడు మీము చెప్పేది కూడా అలాంటి ఓ విలేజ్ గురించే. ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఉల్లి , వెల్లుల్లి అనేది తినడం గ్యారెంటీ. చిన్న పిల్లల దగ్గరి నుండి పండుముసలి వారి వరకు నిత్యం లేదా..రోజుకోసారి ఉల్లి, వెల్లుల్లి తింటారు. ఈ రెండు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని డాక్టర్స్ చెపుతుంటారు. అలాంటి ఉల్లి , వెల్లుల్లి ని బిహార్ జహానాబాద్లోని త్రిలోకి బిఘా గ్రామస్థులు అస్సలు తినరు. మాంసం, మద్యం అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదు. వృద్ధులైతే కనీసం ఉల్లి, వెల్లుల్లి తినకపోవడం ఆశ్చర్యకరం.
25 ఇళ్లున్న ఈ గ్రామంలో యాదవులు అధిక శాతంలో ఉంటారు. వీరు ఉల్లిపాయలు, వెల్లుల్లి ఏ రూపంలోనూ తీసుకోరు. మార్కెట్ నుంచి కొనడం, ఎవరైనా గ్రామానికి తీసుకువచ్చి విక్రయించడం కూడా ఇక్కడ నిషేధమేనట. ఇది ఎప్పటి ఆచారం కాదని కొన్ని ఏళ్ల నుండి వస్తున్న ఆచారమని వారు చెపుతున్నారు.యువత మాత్రం ఈ మధ్య ఉల్లి, వెల్లుల్లి తింటున్నారు. ఎవరైనా ఈ రూల్స్ ఉల్లంఘిస్తే చెడు జరుగుతుందని వారు నమ్ముతుంటారు. అందుకే ఇప్పటివరకు ఉల్లి, వెల్లుల్లి కానీ నాన్ వెజ్ కానీ ముట్టలేదట.
Read Also : Yogi Adityanath : యతి నర్సింఘానంద్ వ్యాఖ్యలపై సీఎం యోగి భగ్గు.. ఏమన్నారంటే..