Site icon HashtagU Telugu

Youtube : యూట్యూబ్‌ను ఇలా కూడా వాడుకుంటారా..? దేవుడా !!

New Trend

New Trend

సోషల్ మీడియా (Social Media) వేదికలు ప్రజల ప్రతిభను వెలికి తీయడానికి, వారి క్రియేటివిటీని ప్రదర్శించడానికి ఓ అద్భుతమైన సాధనంగా మారాయి. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ద్వారా ఎంతో మంది తమ టాలెంట్‌తో గుర్తింపు పొందుతూ లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. కానీ తాజాగా వైరల్ అయిన ఓ వీడియో (Video మాత్రం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. యువతీ యువకులు కొందరు యూట్యూబ్‌లో ఓ వీడియో షేర్ చేస్తూ డబ్బులు సంపాదించిన వీడియో వైరల్ గా మారింది. ఏ పని చేయకుండానే కేవలం క్యూఆర్ కోడ్ను పెట్టుకుని డబ్బులు అడుక్కుంటున్నారు.

Canada : భారత్‌ను టార్గెట్‌ చేసేవారితో సంబంధాలు తెంచుకోవాలి: కెనడా మాజీ ప్రధాని

వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు అర్ధనగ్నంగా కింద కూర్చుని బ్రష్ చేస్తూ కనిపిస్తున్నాడు. అతని ఎదుట మొబైల్ స్క్రీన్‌లో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ‘నా గది అద్దెకు రూ.50 కావాలి’ అంటూ క్యాప్షన్ పెట్టి డబ్బులు అడుగుతున్నాడు. ఆశ్చర్యకరంగా చాలామంది ఆ కోడ్ స్కాన్ చేసి డబ్బులు పంపుతున్నారు. ఈ విధంగా రోజుకు రూ.5000 నుంచి రూ.10,000 వరకు సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాక మరో వ్యక్తి యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం సహాయం కావాలి అంటూ విరాళాలు కోరుతుండగా, మరికొందరు పేరు మెహందీతో రాస్తాం, స్కెచ్ పెన్‌తో రాస్తాం అంటూ విభిన్న రకాలుగా డబ్బులు అడుగుతున్నారు.

XChat: వాట్సాప్‌కు పోటీగా ఎక్స్‌ చాట్‌..ఫీచర్స్‌ ఇవే..!

ఈ విధానంపై నెటిజన్లలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. “ఇలాంటి పనులకు డబ్బులు పంపటం మంచిది కాదని, ఇలాంటి వారిని ప్రోత్సహించటమే తప్పు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు “డిజిటల్ దానధర్మం ఇదే!” అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. యూట్యూబ్ వేదికను వినూత్నంగా వినియోగించుకోవడం మంచిదే కానీ, కష్టం లేకుండా డబ్బులు సంపాదించే మార్గాలను ఆశ్రయించడం మంచి ధోరణి కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.