Viral : డైమండ్స్ కోసం రోడ్ల ఫై పరుగులు..ఎక్కడిక్కడే ట్రాఫిక్ జాం

గుజరాత్‌లోని వరచ్చా ప్రాంతంలో ఓ వజ్రాల వ్యాపారి కోట్ల విలువ చేసే వజ్రాల ప్యాకెట్‌ను పడవేసుకున్నట్టు పుకార్లు వ్యాపించడంతో వజ్రాలకోసం జనం ఎగబడ్డారు

  • Written By:
  • Publish Date - September 25, 2023 / 03:47 PM IST

రోడ్ల ఫై పది రూపాయిల నోట్లు దొరుకుతున్నాయంటేనే జనాలు ఇల్లు వాకిళ్లు వదిలిపెట్టి రోజంతా రోడ్ల పైనే తిరుగుతూ నోట్ల కోసం పట్లు పడుతుంటారు. అలాంటిది డైమండ్స్ దొరుకుతున్నాయంటే ఆగుతారా..ఇంట్లో ఉన్నవారిని సైతం తీసుకెళ్లి వాటికోసం వెతకడం మొదలుపెడతారు. ప్రస్తుతం డైమండ్ సిటీ సూరత్ (Surat) లో అలాగే జరిగింది.

గుజరాత్‌లోని వరచ్చా ప్రాంతం (Varaccha Area)లో ఓ వజ్రాల వ్యాపారి కోట్ల విలువ చేసే వజ్రాల ప్యాకెట్‌ (Diamonds)ను పడవేసుకున్నట్టు పుకార్లు వ్యాపించడంతో వజ్రాలకోసం జనం ఎగబడ్డారు. జనాలతో ఆ ప్రాంతంలో భారీ రద్దీ ఏర్పడింది. కొందరైతే ఏకంగా మార్కెట్ రోడ్డులోని దుమ్మును కూడా వదిలిపెట్టకుండా డైమండ్స్‌ కోసం వెతికేశారు. కొంతమంది వజ్రాలను దక్కించుకుని సంబరాలు చేసుకున్నారు. కానీ అవి నకిలీ వజ్రాలని తేలడంతో ఉసూరుమన్నారు. అయితే తనకు దొరకింది నకిలీ వజ్రం అని తేలిందని, ఇది ఇమిటేషన్‌ జ్యూయల్లరీ, లేదా చీర పనిలో ఉపయోగించే అమెరికన్ డైమండ్‌ అని అరవింద్ పన్సేరియా వాపోయారు. ఇది ఎవరో కావాలని చేసిన ప్రాంక్‌ అయి ఉంటుందన్నారు.

Read Also : War of Governor and CM : సీన్ మారిందా? మార్చారా? మ‌ళ్లీ సీఎంవో, గ‌వ‌ర్న‌ర్ ఢీ!