Dhoni Teases Yogi Babu : క్రికెట్ లెజెండ్ ధోనీ నవ్వులు పూయించాడు.. తమిళనాడుకు చెందిన ప్రముఖ కమేడియన్ యోగి బాబును ఆటపట్టించి మరీ ధోనీ ఎంజాయ్ చేశాడు. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న తమిళ మూవీ “ఎల్ జీ ఎం” (లెట్స్ గెట్ మ్యారీడ్) ట్రైలర్ లాంచ్‌లో ధోనీ చాలా యాక్టివ్ గా కనిపించారు. ఈసందర్భంగా నిర్వహించిన కేక్ కటింగ్ సెషన్‌లో యోగి బాబును ధోనీ ఆటపట్టిస్తూ కనిపించారు. యోగి బాబు, ధోనీ ఒకరికొకరు కేక్ తినిపించుకునే క్రమంలో జోక్స్ చెప్పుకొని నవ్వుకున్నారు. జూలై 10న చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరిగిన ఈ ఈవెంట్ కు సంబంధించి వీడియో ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ (Dhoni Teases Yogi Babu) అవుతోంది. ఈ ప్రోగ్రాంలో ధోనీ భార్య సాక్షి కూడా పాల్గొన్నారు.
Also read : Sweet Cancer : “తియ్యటి” గండం..పట్టణాల్లో అతిగా కృత్రిమ స్వీటెనర్ల వినియోగం
స్వయంగా ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న మొదటి మూవీ “ఎల్ జీ ఎం”. ఇందులో హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెలాఖరులో “ఎల్ జీ ఎం” సినిమా విడుదల కానుంది. రమేష్ తమిళమణి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమేడియన్ యోగి బాబు, మిర్చి విజయ్, VTV గణేష్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా ధోనీకి తమిళనాడులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు తమిళ సినిమాలతో ఆ క్రేజ్ ను బిజినెస్ లోకి మార్చుకునే ప్రయత్నాల్లో ధోనీ ఉన్నాడు.