Site icon HashtagU Telugu

Delhi: ట్రాఫిక్ రూల్స్ పై వినూత్న ప్రయోగం చేసిన పోలీసులు.. వీడియో వైరల్?

Delhi

Delhi

పోలీసులు మన రక్షణ కోసం ఎన్నో రకాల ట్రాఫిక్ రూల్స్ ని తీసుకు వచ్చినప్పటికీ ఏ ఒక్కరు కూడా వాటిని పాటించకుండా వాటిని బ్రేక్ చేస్తూ ఉంటారు. ఫలితంగా ఆ ప్రాణాలను కూడా పోగొట్టుకోవడంతో పాటు పక్కవారి ప్రాణాలను కూడా చూస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా అతివేగం. అతివేగం ప్రాణానికి ప్రమాదం అని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా వాహనదారులు మాత్రం పట్టించుకోకుండా వాటిని పెడచెవిన పెట్టేస్తూ ఉంటారు. అందుకే ట్రాఫిక్ పోలీసులు అటువంటి వారికి ముక్కు పిండి మరీ చలానా వసూలు చేస్తూ ఉంటారు.

వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించడం కోసం పోలీసులు ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాహదారులు మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఢిల్లీ పోలీసులు కాస్త విన్నూత్నంగా ఆలోచించారు. పబ్లిక్ ఆలోచనలకు సరిపోయే విధంగా ఒక రీల్ రూపంలో అడ్వర్టైజ్మెంట్ లు ఇచ్చారు. మరి ఆ వినూత్న ఆలోచన ఏంటి అన్న విషయానికి వస్తే.. ఒక అందమైన అమ్మాయి పెళ్లికూతురుగా రెడీ అయింది. ఖరీదైన నగలు దుస్తులు ధరించింది.

 

హెల్మెట్ లేకుండా స్కూటీని నడుపుతోంది. వారి వారి జాన్ పాటను ఎంజాయ్ చేస్తూ అందుకు తగ్గట్టుగా మూమెంట్ చేస్తూ బండి నడుపుతోంది. కానీ చివర్లో ఊహించని అదృష్టం ఎదురయ్యింది. ఆమెకు పోలీసులు ఆరు వేల రూపాయలు జరిమానా విధించారు. హెల్మెట్ లేనందుకు రూ.1,000, లైసెన్స్ లేనందుకు 5000 రూపాయలు చొప్పున మొత్తం 6000 రూపాయలు ఫైన్ వేశారు. అయితే ఆ జరిమానాకు సంబంధించిన పే స్లిప్ లు వీడియోలో చివర్లో చూపించారు. సదరు వీడియోని ఢిల్లీ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమిస్తే జరిమానా తప్పదు అని తెలిపే విధంగా ఈ వీడియోని క్రియేట్ చేశారు.