Site icon HashtagU Telugu

Delhi Metro : ఢిల్లీ మెట్రో నుంచి వైరల్ అవుతోన్న మరో వీడియో.. ఈసారి లేడీస్ కోచ్ లో..

Delhi Metro A Man fight with Women in Women Coach Video goes viral

Delhi Metro A Man fight with Women in Women Coach Video goes viral

కొన్ని నెలలుగా ఢిల్లీ మెట్రోలో(Delhi Metro) జరుగుతున్న సంఘటనలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రొమాన్స్ తో మొదలు.. ఫైటింగ్స్ వరకూ ఢిల్లీ మెట్రోలో జరిగే ప్రతి గొడవ వైరల్ అవుతోంది. ఎవరో ఒకరు ఈ సంఘటనలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అవి వైరల్ అవడం, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని ఢిల్లీ మెట్రో అధికారులు చెప్పడం.. సేమ్ రిపీట్. ప్రేమికుల సరసాలు, ఒంటరిగా ఉన్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం, పురుషులు, మహిళలు కొట్టుకోవడం ఇలాంటి ఎన్నో ఘటనలకు ఢిల్లీ మెట్రో కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది.

తాజాగా ఢిల్లీ మెట్రోలో జరిగిన మరో ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి మహిళల కోచ్ లోకి ఎక్కగా.. ఎందుకు ఎక్కావంటూ ఇద్దరు మహిళలు నిలదీస్తున్నట్లు కనిపించారు. అయితే సదరు వ్యక్తికి సపోర్ట్ గా అతని గర్ల్ ఫ్రెండ్ మద్దతుగా నిలవడం కనిపిస్తోంది. ఎందుకు ఎక్కావని ఒక మహిళా ప్రయాణికురాలు ప్రశ్నిస్తూ వీడియో తీస్తుంటే.. తాను మెట్రో నిబంధనలకు విరుద్ధంగా ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని చెప్పే ప్రయత్నం చేశాడు. అతని వెంట ఉన్న మరో మహిళ ఆ వీడియో తీసే అమ్మాయిని అడ్డుకోబోగా.. వారిద్దరి మధ్య మాటలయుద్ధం జరిగింది.

ఈ ముగ్గురి మధ్య వాగ్వాదాన్ని గమనిస్తోన్న అదే కోచ్ లో ఉన్న మరో మహిళ.. లేడీస్ కోచ్ లోకి మీరెలా ఎక్కుతారని ఆ యువకుడిని ప్రశ్నించింది. తర్వాతి స్టేషన్లో కోచ్ లో నుంచి దిగాలని చెప్పింది. ఇదంతా రికార్డ్ చేసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారగా.. ఢిల్లీ మెట్రో ఫైటింగ్ లకు కేరాఫ్ అడ్రస్ అవుతుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు.

 

Also Read : Delhi Metro: ఢిల్లీ మెట్రోలో అమ్మాయిల పోల్ డాన్స్.. చక్కర్లు కొడుతున్న వీడియో