Rajanna Sircilla : బ్రతికుండగానే కూతురికి పిండ ప్రదానాలు చేసిన తండ్రి

కూతురు బ్రతికుండగానే శ్రద్ధాంజలి ఘటిస్తూ..పిండ ప్రదానాలు చేసాడంటే ఆ కూతురు ఆ తండ్రిని ఎంత బాధపెట్టిందో అర్ధం చేసుకోవాలి

Published By: HashtagU Telugu Desk
Daughter Love Marriage

Daughter Love Marriage

అల్లారుముద్దుగా పెంచి పెద్దచేసి..ఓ చక్కనైన అబ్బాయి చేతిలో పెట్టి విశ్రాంతి తీసుకోవాలని అనుకున్న ఆ తండ్రి..కూతురు బ్రతికుండగానే శ్రద్ధాంజలి ఘటిస్తూ..పిండ ప్రదానాలు చేసాడంటే ఆ కూతురు ఆ తండ్రిని ఎంత బాధపెట్టిందో అర్ధం చేసుకోవాలి. ఇటీవల కాలం లో ప్రేమ అనేది ఎక్కువైపోయింది. రెండు రోజుల పరిచయంతోనే కన్నవారిని పక్కన పెట్టి ప్రేమించిన యువకుడితో ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకుంటున్నారు. తీరా కోర్కెలన్నీ తీరగానే ప్రియుడు కొడుతున్నాడని, హింసిస్తున్నాడని చెప్పి మళ్లీ తల్లిదండ్రుల వద్దకు వస్తున్నారు. ఇలాంటి ప్రేమ కథలు ప్రతి రోజు పదుల సంఖ్యలో చూస్తూనే ఉన్నాం.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. జిల్లాకు చెందిన చిలువేరి అనూష అనే యువతి ఇంటర్ చదువుకుంటుంది. అయితే కొద్దిరోజులుగా అనూష ఓ యువకుడిని ప్రేమలో పడింది. ఆ విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే ఏమి జరుగుతుందో అనే భయంతో ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది. అయితే బయటకు వెళ్లిన కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు బంధువులకు, మిత్రులకు ఫోన్ చేశారు. ఎవ్వరు కూడా మాకు తెలియదు..మాకు తెలియదు మా వద్దకు రాలేదని చెప్పడం తో ఎటు వెళ్లిందా అని ఖంగారుపడుతున్నారు. ఈ క్రమంలో అనూష ఓ యువకుడిని పెళ్లిచేసుకుందని తెలిపడంతో కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. తన కూతురు చేసిన పనికి తండ్రి గుండె పగిలింది. వెళ్లిపోయిన కూతురుని తీసుకరాలేక..ఓ ఫ్లెక్సీని ఏర్పటు చేశాడు. తన కూతురు అనూష చనిపోయింది. తనకు శ్రద్దాంజలి ఘటిస్తున్నానని. అందులో పేర్కొన్నాడు. అంతే కాదు ఆ కూతురుకు పిండ ప్రదానాలు సైతం చేసాడు. దీనికి సంబదించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

Read Also ; Pothina Mahesh : కాపు సామాజికవర్గాన్ని ‘పవన్ కళ్యాణ్’ బలి చేస్తున్నారు – పోతిన మహేష్

  Last Updated: 08 Apr 2024, 04:38 PM IST