Site icon HashtagU Telugu

Rain Of Notes : సంగీత మాధుర్యానికి కరెన్సీ వర్షం.. నోట్లతో నిండిపోయిన స్టేజ్

Rain Of Notes

Rain Of Notes

Rain Of Notes : ఒక జానపద గాయని నిర్వహించిన సంగీత కచేరీలో నోట్ల వర్షం కురిసింది. అక్కడున్న అభిమానులు నోట్లను ఆ సింగర్ కూర్చున్న స్టేజీపైకి కుమ్మరించారు. చప్పట్లు, విజిల్స్, కేరింతలతో మొత్తం వేదికను హోరెత్తించారు. ఈ ప్రోగ్రామ్ గుజరాత్‌ రాష్ట్రంలోని కచ్‌  లో జరిగింది. గోశాల ఏర్పాటుకు అవసరమైన నిధులను సేకరించేందుకు ఈ సంగీత కచేరీని నిర్వహించారు. దీనికి స్థానికంగా మంచిపేరున్న  జానపద గాయని ఊర్వశీ రాధాదియాను ఆహ్వానించారు. ఊర్వశి చక్కటి పాటలు పాడుతూ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆమె సాంగ్స్ కు ముగ్ధులైన ఆడియన్స్ ఆమెపై నోట్ల వర్షం (Rain Of Notes) కురిపించారు. దీంతో వేదికపై మొత్తం నోట్లు నిండిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఊర్వశీ రాధాదియా తన  ట్విటర్‌ అకౌంట్ లో రీపోస్ట్‌ చేశారు.

Also read : NIA  Raids – Hyderabad : హైదరాబాద్ లోని ఐసిస్ సానుభూతిపరుల ఇళ్లలో ఎన్ఐఏ రైడ్స్