Site icon HashtagU Telugu

Crocodile: మంచం కింద మొసలి.. మంచం పైన ఇంటి యజమాని.. తెల్లారి కళ్ళు తెరిచి చూసేసరికి?

Crocodile

Crocodile

మొసలి మాంసాహార జంతువు అన్న విషయం తెలిసిందే. మామూలుగా మొసలిని చూస్తే ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు. పొరపాటున మొసలిని చిక్కితే మాత్రం ప్రాణాల మీద అసలు వదులుకోవాల్సిందే. ఒకవేళ అలాంటి క్రూరమైన మొసలి మీరు పడుకునే మంచం కిందే ఉంటే.. వినడానికి కాస్త భయంకరంగా ఉన్న ఈ ఘటన తాజాగా ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపుర్‌ ఖీరీలోని భీరా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫుట్హా గ్రామంలోని ఒక ఇంటిలోని ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆ ఇంటి బెడ్‌రూంలోని మంచం కింద రాత్రంతా ఒక భారీ మొసలి పడుకొని ఉంది. అది ఉదయాన్నే వారి కంటపడింది. అంతే ఇంటిలోని వారందరికీ ఆ క్షణంలో ప్రాణాలు పోయినట్లు అనిపించింది. వెంటనే వారందరు బయటకు పరుగులు తీశారు. ఆ విషయం కాస్త గ్రామంలోని వారందరికీ తెలియడంతో వారందరు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలో ఈ సమాచారాన్ని అటవీశాఖ అధికారులకు చేరవేశారు. అయితే వారు వచ్చేలోగానే గ్రామస్తులంతా కలసి దానిని ఒక సంచీలో బంధించి నదిలో వదిలివేశారు. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో శారదా నదిలోకి వరదనీరు చేరింది.

ఈ నేపధ్యంలోనే శారదా నది నుంచి కొట్టుకువచ్చిన ఒక మొసలి గ్రామానికి చెందిన లాలా రామ్‌ ఇంటిలోనికి ప్రవేశించింది. అది రాత్రంతా మంచం కిందే ఉంది. ఆ మంచం మీదనే ఇంటి యజమాని లాలా రామ్‌ పడుకున్నాడు. ఉదయం ఆయన కళ్లు తెరవగానే అతనికి భారీ ఆకారంలో ఉన్న మొసలి కనిపించింది. వెంటనే అతను భయంతో కేకలు వేయడం మొదలు పెట్టాడు. అతని అరుపులు విని అక్కడికి వచ్చిన ఇంటిలోని వారంతా భయంతో పరుగులు తీశారు.

Exit mobile version