Site icon HashtagU Telugu

Elephant Art House: వ్యర్ధాలతో నిర్మించిన ఇంటికి 28 ఏళ్లు.. చూడటం కోసం భారీగా ఎగబడుతున్న జనం?

Elephant Art House

Elephant Art House

భూమి మీద ప్రతి ఒక్క వస్తు వస్తువు కూడా ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయం తెలిసిందే. వస్తువు అంటే వ్యర్థాలు, చెత్త కూడా ఉపయోగపడతాయా అంటే అవును అని చెప్పవచ్చు. తాజాగా అదే విషయాన్ని అవును అని ఒక నిరూపించారు ఒక జంట. ఒక జంట దాదాపు ఒకటి రెండు కాదు 28 ఏళ్ల పాటు కష్టపడి ఒక విచిత్రమైన ఇంటిని నిర్మించారు. అయితే ప్రస్తుతం ఆ ఇంటిని చూడడం కోసం జనాలు ఎగబడుతున్నారు. ఆర్టిస్ట్‌ మైకల్‌, అతని భార్య లెడా లీవెంట్‌ ఈ ఇంటి నిర్మాణాన్ని 1979లో ప్రారంభించారు.

ఈ ఇంటికి వారు ఎలిఫాంట్‌ ఆర్ట్‌ హౌస్‌ అనే పేరు పెట్టారు. కాగా 2007లో మైకల్‌ మృతి చెందాడు. అతని భార్య లెడా లీవెంట్‌ ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఇంటి నిర్మాణం పూర్తికావడానికి దాదాపుగా 28 ఏళ్లు పట్టింది. ఈ వింత ఇల్లు అమెరికాలోని అరిజోనాలో ఉంది. ఈ ఇల్లు ఎంట్రన్స్‌ మొదలు అంతా వింతగా కనిపిస్తుంది. ఏదో గుహలోకి వెళుతున్న భావన కలుగుతుంది. రాతితో నిర్మించిన ఈ ఇల్లు రంగులమయంగా కనిపిస్తుంది. మూడు ఎకరాల్లో నిర్మింతమైన ఈ ఇల్లు 25 అడుగుల సీలింగ్‌ కలిగివుంది. ఇంటిలో అద్భుతమైన కిటికీలు ఏ‍ర్పాటు చేశారు. వెలుగు కోసం ఇంటిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Elephant Art House

ఇంటి గోడలను సిమెంట్‌, రాళ్లు, చెక్క మొదలైన వాటితో నిర్మించారు. అయితే ఇంటిలోని నేల భాగమంతా సమతలంగా ఉండదు. అయితే దీని గురించి తాము ఆలోచించలేదని, ఒక గూడు కావాలని కోరుకుని ఈ అందమైన ఇంటిని నిర్మించామని లెడా వెల్లడించారు. అంతేకాకుండా వ్యక్తాలతో నిర్మించిన ఆ ఇంటికి విద్యుత్‌, నీరు, ఫోను సదుపాయాలు ఉన్నాయి. కాగా ఈ ఇంటిని చూసేందుకు వేలమంది వస్తుంటారని లెడా తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆ ఇంటిని మొత్తం అంతా కూడా పురాతన పనికిరాని వస్తువులతోనే ఎంతో అందంగా నిర్మించారు.