Site icon HashtagU Telugu

Video Viral: రోడ్డుపై స్టంట్లు చేస్తూ చక్కర్లు కొట్టిన జంట.. చివరికి దూల తీరిందిగా?

Video Viral

Video Viral

ఈ మధ్య కాలంలో చాలామంది యువత కొత్త కొత్త విన్యాసాలను చేస్తూ అనవసరంగా ప్రాణాల మీద కొని తెచ్చుకుంటున్నారు. అమ్మాయిలను గర్ల్ ఫ్రెండ్ ని వెనకవైపు బైక్ లో కూర్చోబెట్టుకుని రోడ్లపై రకరకాల స్టంట్ లు చేస్తూ పక్కన వాహనదారులకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది ఈ స్టంట్ లు చేసే నేపథ్యంలో ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. కొందరు పబ్లిక్ లో నవ్వుల పాలు అవుతున్నారు. తాజాగా కూడా ఒక జంట రోడ్డుపై రకరకాల విన్యాసాలు చేస్తూ బైక్ పై స్టంట్ లు చేసే ప్రయత్నం చేసింది.

కానీ చివరికి దూల తీరిపోయింది. అసలేం జరిగిందంటే.. బైక్ పై జంట రయ్ మంటూ ఫుల్ స్పీడ్ తో దూసుకుపోతోంది. బైక్ నడిపే వ్యక్తి వెనుక గర్ల్ ఫ్రెండ్ ను కూర్చోబెట్టుకున్నాడు. హ్యాండిల్ తో ముందు చక్రాన్ని గాల్లోకి లేపుతూ ముందుకు పోనిస్తున్నాడు. ఉన్నట్టుండి దానిపై నియంత్రణ కోల్పోవడంతో వెనుక కూర్చున్న మహిళ అలానే బలంగా రోడ్డుపై పడిపోయింది. ఆ దెబ్బకు సదరు మహిళలకు ఎముకల జాయింట్లు విరిగిపోయి ఉంటాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు స్పందించారు.

 

ఆ వీడియోని ఢిల్లీ పోలీసులు షేర్ చేస్తూ నిర్లక్షపూరిత డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకోవడం అనే క్యాప్షన్ కూడా జోడించారు. కొందరు నెటిజెన్స్ ఆ వీడియో పై స్పందిస్తూ అలా పిచ్చిపిచ్చి స్టంట్ లు చేస్తే చివరికి ఫలితం ఇలాగే ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు నవ్వుతున్న ఏమోజీలను ఆ వీడియో కింద కామెంట్ రూపంలో పెడుతున్నారు. పాపం కుర్రాడికి దూల తీరిపోయింది అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.