Sleeping On Currency : కరెన్సీ నోట్లతో పొలిటీషియన్ నిద్ర.. ఫొటోలు వైరల్

Sleeping On Currency : అతడొక పొలిటీషియన్..  రూ.500 నోట్లపై అర్ధనగ్నంగా పడుకొని వీడియోలకు ఫొజులిచ్చాడు..

Published By: HashtagU Telugu Desk
Sleeping On Currency

Sleeping On Currency

Sleeping On Currency : అతడొక పొలిటీషియన్..  రూ.500 నోట్లపై అర్ధనగ్నంగా పడుకొని వీడియోలకు ఫొజులిచ్చాడు.. ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీంతో అతగాడు సభ్యుడిగా ఉన్న పార్టీ యాక్షన్ తీసుకుంది.వివరాల్లోకి వెళితే..

We’re now on WhatsApp. Click to Join

అసోంలోని ఉదల్​గురీ జిల్లాకు చెందిన బెంజమిన్‌ బసుమతారీ యూపీపీఎల్‌ పార్టీ నాయకుడిగా చలామణి అయ్యేవాడు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, గ్రామీణ ఉపాధి హామీ పథకాల అమలులో అక్రమాలకు పాల్పడ్డాడనే అభియోగాలు బెంజమిన్​పై ఉన్నాయి. ఉదల్​గురీ విలేజ్‌ కౌన్సిల్ డెవలప్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో లబ్ధిదారుల నుంచి లంచాలు వసూలు చేశాడనే అభియోగాలు అతడిపై నమోదయ్యాయి. దీంతో ఈ ఏడాది జనవరి 10నే బెంజమిన్‌ బసుమతారీని యూపీపీఎల్‌ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

Also Read : Punjab CM : పంజాబ్ సీఎం మళ్లీ తండ్రి అయ్యారు.. రెండో భార్యకు ఆడశిశువు

తమ పార్టీకి, నోట్ల కట్టలతో అర్ధ నగ్నంగా నిద్రపోయిన బెంజమిన్​‌కు సంబంధం లేదని యూపీపీఎల్‌ పార్టీ తేల్చి చెప్పింది. బెంజమిన్ బసుమతారీని యూపీపీఎల్‌ ​ పార్టీతో లింక్ చేసి మాట్లాడటం మానుకోవాలని అన్ని మీడియా సంస్థలు, సోషల్​ మీడియా వినిమోగదారులకు రిక్వెస్ట్ చేసింది. ‘‘ప్రస్తుతం వైరల్(Sleeping On Currency) అవుతున్న ఫొటో బెంజమిన్‌ వ్యక్తిగత వ్యవహారం. దానికి పార్టీ జవాబుదారీ కాదు’’  అని ఎక్స్ వేదికగా యూపీపీఎల్ పార్టీ చీఫ్ ప్రమోద్‌ బోరో వెల్లడించారు. బెంజమిన్‌ను జనవరిలోనే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని గుర్తుచేశారు. ఫిబ్రవరి 10న ఉదల్​గురీ విలేజ్ కౌన్సిల్ డెవలప్​మెంట్ కమిటీ ఛైర్మన్ పదవి నుంచి కూడా బెంజమిన్‌ను బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ (బీటీసీ) సస్పెండ్ చేసింది.

Also Read :Nirmala Sitharaman: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన.. డబ్బులేక పోటీ చేయట్లేదు..!

  Last Updated: 28 Mar 2024, 02:01 PM IST