Colombian Man: బొమ్మతో పెళ్లి.. ఆపై పిల్లలు కూడా.. వాట్ ఏ లవ్ స్టోరీ

మనిషి జీవితంలో తోడు కోరుకోవడం సహజం. పెళ్లి, పిల్లలు, బంధువులు అంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు.. నలుగురితో ఉన్న సంతోషం ఒంటరిగా ఉన్నప్పుడు పొందలేము.

Published By: HashtagU Telugu Desk
Colombian Man

New Web Story Copy 2023 08 09t113535.139

Colombian Man: మనిషి జీవితంలో తోడు కోరుకోవడం సహజం. పెళ్లి, పిల్లలు, బంధువులు అంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు.. నలుగురితో ఉన్న సంతోషం ఒంటరిగా ఉన్నప్పుడు పొందలేము. ప్రస్తుతం సోలో లైఫ్ సో బెటర్ అంటూ కొటేషన్స్ ప్రచారంలో ఉన్నాయి. కానీ ప్రాక్టీకల్ లైఫ్ లో అలాంటివేం కుదరవు. ఒక పీరియడ్ వరకు ఒంటిరిగా బాగున్నప్పటికీ సుదీర్ఘ కాలంలో ఆ పప్పులేం ఉడకవు.ఇక ఒంటరిగా జీవితం గడిపేవారు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని నిపుణులు చెప్తున్నారు. కొందరు ఒంటరి జీవితాన్ని తట్టుకోలేక డిప్రెషన్ కి గురైన సందర్భాలు కూడా ఉన్నాయి.

కొలంబియాలో ఓ వ్యక్తి ఒంటరి జీవితాన్ని భరించలేక టెక్నాలజీ సహాయంతో ఓ బొమ్మను సృష్టించి వివాహం చేసుకున్నాడు. బొమ్మతో పిల్లలు కనే అవకాశం ఉండదు కాబట్టి అదే టెక్నాలజీ సాయం తీసుకుని ఇద్దరు పిల్లలని కూడా తయారు చేశాడు. అంటే ఇద్దరు పిల్లలని కన్నడన్నమాట. మొత్తానికి అతను ఓ కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ ఇది నిజం.

కొలంబియాకు చెందిన క్రిష్టియన్‌ మోంటెనెగ్రో ఒక లవ్ ఫెయిల్యూర్. క్రిష్టియన్‌ మోంటెనెగ్రో ఓ యువతిని ప్రేమించాడు. మొదట్లో ప్రేమగా ఉన్నారు. రానురాను ఇద్దరిమధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. కలిసి ఉండి కొట్టుకునే బదులు విడిపోయి సంతోషంగా ఉండాలనుకున్నారు. అలా వారిద్దరు దూరమయ్యారు. కొన్నాళ్ల తరువాత క్రిష్టియన్‌ మోంటెనెగ్రో ఒంటరి తనంతో డిప్రెషన్ కి గురయ్యాడు. ఒంటరి జీవితాన్ని భరించలేకపొయ్యాడు. ఇలానే కొనసాగితే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని విభిన్నంగా ఆలోచించాడు. మరో యువతీ జోలికి పోకూడదని ఫిక్స్ అయి ఒక బొమ్మను తయారు చేసి తనకు తోడుగా తెచ్చుకోవాలి అనుకున్నాడు. టెక్నాలజీ సహాయంతో ఓ బొమ్మని కూడా సృష్టించాడు. ఆ బొమ్మకు నటాలియాల అని పేరు కూడా పెట్టుకున్నాడు. నటాలియాలతో తన జీవితం చాలా సంతోషంగా ఉందంటున్నాడు క్రిష్టియన్‌ మోంటెనెగ్రో. కొన్నాళ్ళకు ఈ జంట ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. కనడం అంటే మరో రెండు బొమ్మల్ని సృష్టించాడు. ప్రస్తుతం క్రిష్టియన్‌ మోంటెనెగ్రో భార్య ఇద్దరు పిల్లలతో వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నాడు.

క్రిష్టియన్‌ మోంటెనెగ్రో తన భార్య, పిల్లల ఫోటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం క్రిష్టియన్‌, నటాలియాల లవ్‌ స్టోరీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read: Pawan Kalyan: ఆ దృశ్యాలు చూస్తే గుండె బరువైపోతుంటుంది: పవన్ కళ్యాణ్ ఎమోషనల్

  Last Updated: 09 Aug 2023, 11:42 AM IST