ఫ్యాషన్(Fashion) ప్రపంచంలోని మెగా ఈవెంట్ లలో ఒకటైన మెట్ గాలా 2023(Met Gala) ఫ్యాషన్ ఈవెంట్ న్యూయార్క్ లో అట్టహాసంగా జరిగింది. ది మెట్రోపాలిటన మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో జరిగిన ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా ఎందరో నటీనటులు, ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. ఈ వేడుకకు హాజరైన సెలబ్రిటీస్ లో కొందరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వారిలో బాలీవుడ్(Bollywood) నటి అలియా భట్(Alia Bhatt) కూడా ఒకరు. లక్ష ముత్యాలతో రూపొందించిన గౌనును ధరించిన అలియా భట్.. అందరి చూపులను ఆకర్షించింది. అయితే ఇక్కడ అలియా భట్ కంటే అత్యధికంగా ఫేమస్ అయింది ఒక బొద్దింక(Cockroach). ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకూ ఈ వీడియోకు 7.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ ఈ వీడియో గురించి నెటిజన్లు చర్చించుకుంటూనే ఉన్నారు.
మెట్ గాలా 2023 ఈవెంట్ లో ఒక రెడ్ కార్పెట్ పై బొద్దింక అరంగేట్రం చేసింది. బొద్దింకే కదా అని అక్కడున్న ఫొటో గ్రాఫర్ లైట్ తీస్కోలేదు. అది రెడ్ కార్పెట్ పై తిన్నగా లోపలికి వెళ్తుండగా దాని వెంటే వీడియోలు, ఫొటోలు తీశారు. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ అయిన ట్విట్టర్లో వెరైటీ అనే యూజర్ నేమ్ నుండి ఆ వీడియోను పోస్ట్ చేశారు. బొద్దింక తొలి చిత్రం ఇప్పటికే 2 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. చాలా మంది నెటిజన్లు సరదా కామెంట్స్ పోస్ట్ చేశారు.
A cockroach has arrived at the #MetGala. https://t.co/OcPy5ckhQN pic.twitter.com/4YiEPs5cIT
— Variety (@Variety) May 2, 2023
నెటిజన్లు చేసిన కామెంట్లలో కొన్ని కామెంట్లు ఇలా ఉన్నాయి. ఆ ఫొటోగ్రాఫర్ తన కెరీర్ లోనే బెస్ట్ ఫొటో తీస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నాడు అని ఒకరంటే.. మరొకరు.. ఆమె ధరించిన డ్రెస్ ఏంటి అని, ఇంకొకరు ఇది అక్కడున్న చాలా మందికంటే బాగా కనిపిస్తుంది అని కామెంట్ చేశారు. ఒక నెటిజన్ అయితే.. ఫొటోగ్రాఫర్ బొద్దింకను చంపడానికి బదులుగా ఫొటో తీశాడు అని కామెంట్ చేశాడు. కొద్దిసేపటికి బొద్దింక చనిపోగా.. దానికి సంతాపం తెలుపుతూ కూడా వెరైటీ ట్వీట్ చేయడం గమనార్హం. ఈ ఫొటోలు, వీడియోలను కెవిన్ మజూర్ తీసినట్లు కూడా తెలిపింది. ఏదేమైనా ఒక బొద్దింక రెడ్ కార్పెట్ పైకి వచ్చిన వీడియోలు, ఫొటోలకు కొన్ని మిలియన్ వ్యూస్ రావడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.
Also Read : Taxi Safe App: ఆటో ఎక్కుతున్నారా.. ‘ట్రేస్ మై లొకేషన్’ తో నేరాలకు చెక్!