Site icon HashtagU Telugu

Cobra Snake: వ్యక్తి షర్టు లోపలికి దూరిన చుక్కలు చూపించిన నాగుపాము.. వీడియో వైరల్?

Cobra

Cobra

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా వర్షాలు దంచి కొడుతుండడంతో మూగజీవాలు జలచరాలు జనావాసంలోకి వస్తున్నాయి. కాగా ఈ వర్షాల కారణంగా చిత్తడిగా ఉండడంతో పాటు ఎక్కడ చూసినా వరదలు రావడంతో పాములు, విష కీటకాల బయటికి వస్తున్నాయి. వర్షాల కురుస్తున్న నేపథ్యంలో అప్పటి వరకు భూమి లోపల ఉన్న బొరియల్లో నీరు నిండడం వల్ల పాములు పొదల్లో, గడ్డిలో దాక్కుంటాయి. అయితే, తాజాగా ఒక మనిషి షర్ట్‌లోకి పాము దూరిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఇక, పాము అతడి చొక్కాలో ఉ‍న్నంతసేపు బాధితుడి అలాగే కూర్చుండి పోయాడు.

తాజాగా ఒక వ్యక్తి పార్క్‌ వంటి ప్రదేశంలో చెట్టు కింద పడుకున్నాడు. ఈ క్రమంలో కింగ్ కోబ్రా అతని షర్ట్‌ లోపలికి ప్రవేశించింది. దీంతో, సదరు వ్యక్తి భయంతో వణికిపోయాడు. ఇక, అతని చొక్కా రెండు బటన్‌లు తెరిచి ఉండటంతో కింగ్ కోబ్రా తన తలను బయటకు పెట్టి చూస్తోంది. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు అతడిని పాము నుంచి కాపాడే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా బాధితుడి షర్ట్‌ బటన్స్‌ ఓపెన్‌ చేసిన తర్వాత పాము తోక భాగం నేలపై ఉన్న గడ్డిపైకి వస్తుంది. దీని తరువాత, ఆ వ్యక్తి నెమ్మదిగా ముందుకు సాగాడు అప్పుడు నడుము వైపు ప్రవేశించిన నాగుపాము తల కూడా బయటకు వచ్చింది.

 

అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియరాలేదు కానీ ఆ వ్యక్తి మాత్రం చాలా అదృష్టవంతుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కింగ్‌ కోబ్రా షర్ట్ లోపలికి దూరిన కూడా ఆ పాము కాటు నుంచి సదరు వ్యక్తి బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆ పాము బయటకు వచ్చేవరకు ఆ వ్యక్తికి నరకం అనుభవించి ఉంటాడు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఉంటాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version