KIFF 2023: డ్యాన్స్ చేసిన సీఎం మమతా బెనర్జీ

ఓ వేడుకలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, హీరో సల్మాన్ ఖాన్ తదితరులు కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

Published By: HashtagU Telugu Desk
Mamata Banerjee At KIFF 2023

Mamata Banerjee At KIFF 2023

KIFF 2023: ఓ వేడుకలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, హీరో సల్మాన్ ఖాన్ తదితరులు కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సమాచార, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 29వ ‘కేఐఎఫ్ఎఫ్’ వేడుకలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, సోనాక్షి సిన్హా, క్రికెటర్ సౌరభ్ గంగూలీ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (కేఐఎఫ్ఎఫ్)లో సందడి చేశారు ఈ క్రమంలో సల్మాన్ రిక్వెస్ట్ చేయడంతో మమతా బెనర్జీ వేదికపైకి కాలు కదిపింది. ఈ డ్యాన్స్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Also Read: Delhi Police PCR: ఢిల్లీ పోలీసుల పెట్రోలింగ్ విభాగానికి 400 కొత్త వాహనాలు

  Last Updated: 05 Dec 2023, 10:56 PM IST