కొన్ని భయంకరమైన సంఘటనలు ఊహించని ప్రమాదాలు జరిగినప్పుడు అదృష్టవశాత్తు బతికి బయటపడితే భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయి అని అంటూ ఉంటారు. మామూలుగా ఒక 30 లేదా 40 అడుగుల పైనుంచి పడితే కాళ్లు చేతులు విరిగిపోవడం కొన్ని కొన్ని సార్లు దెబ్బలు గట్టిగా తగిలితే చనిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా వేలా అడుగుల ఎత్తు నుంచి పడినా కూడా అతనికి ఏమీ జరగలేదట. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది ఆ వ్యక్తి ఎవరు అన్న వివరాల్లోకి వెళితే..
వినడానికి ఆశ్చర్యం కలిగించేలా ఉన్న ఈ ఘటన న్యూజిలాండ్ లోని పర్వతసానువుల్లో తాజాగా జరిగింది. నార్త్ ఐలాండ్‌లోని టరనకీ పర్వతంపైకి అధిరోహించేందుకు శనివారం పర్వతారోహకుల బృందం బయలుదేరింది. మధ్యాహ్నం సమయంలో 1,968 అడుగుల మేర ఎక్కిన తర్వాత ఒక పర్వతా రోహకుడు అనూహ్యంగా జారి పడిపోయాడు. అయితే, అతడికి స్వల్పంగానే గాయాలు అయ్యాయి. అయితే అక్కడి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో అతడు పడిన చోట మంచు మెత్తగా మారడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. అంత ఎత్తు నుంచి కింద పడినా కూడా అతడు ప్రాణాలతో ఉండటం అన్నది నిజం అద్భుతమైన విషయమని, అతడు చాలా అదృష్టవంతుడని పోలీసులు అంటున్నారు.
న్యూజిలాండ్‌లోని అత్యంత ప్రమాదకరమైన పర్వతాల్లో టరనాకీ ఒకటిగా పేర్కొంటారు. ఇదే ప్రాంతం నుంచి 2021లో ఇద్దరు పర్వతారోహకులు జారిపడి మృతి చెందారు. నార్త్ ఐలాండ్‌లోనే నిద్రాణ అగ్నిపర్వతం కూడా ఉంది. ఇతర పర్వతాల నుంచి వేరుపడినట్లుగా దూరంగా ఉండటం, తీరానికి సమీపంలో ఉండటం, వేగంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు సంభవించడం వంటి పరిస్థితులు న్యూజిలాండ్‌లో టరనాకీ వద్ద తప్ప మరెక్కడా లేవని మౌంటెన్ సేఫ్టీ కౌన్సిల్ పేర్కొంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అతనికి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి అని కొందరు కామెంట్ చేయగా ఇంకొందరు చాలా అదృష్టవంతుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.