1997లో వచ్చిన టైటానిక్ (Titanic) సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. లియోనార్డో డికాప్రియో పోషించిన జాక్ కు కేట్ విన్స్‌లెట్ పాత్రలో రోజ్ వీడ్కోలు పలికే క్లైమాక్ సన్నివేశం (టైటానిక్ షిప్ మునిగిపోయే సమయం) ఆ మూవీకే హైలైట్. ఇప్పటికీ ఆ సీన్ ప్రత్యేకమే. సినీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది కూడా. టైటానిక్ షిప్ (Ship) మునిగిపోతున్న వేళ రోజ్ జాక్ ను కాపాడే ప్రయత్నం చేస్తుంది. కానీ కళ్ల ముందు తన ప్రియుడు సముద్రంలో మునిగిపోతాడు.
అయితే టైటానిక్ (Titanic) సినిమాకు ఫిదా అయిన ఓ జంట ఈ మూవీ క్లైమాక్స్ ను చాలా ఫన్నీగా షూట్ చేసే ప్రయత్నం చేశారు. హీరో జాక్ సముద్రంలో మునిగిపోతుండగా, హీరోయిన్ రోజ్ చూస్తూ అలాగే ఉండిపోతోంది. తీవ్ర విషాదంలో ఉన్నట్టు బిల్డప్ ఇస్తుంది. అయితే జాక్ సముద్రంలో మునిగిపోయాక అతని మొబైల్ తీసుకుంటుంది. అయితే సడన్ గా జాక్ నీళ్లలోంచి పైకి లేచి మొబైల్ లాక్కునే ప్రయత్నం చేస్తాడు. కానీ రోజ్ మాత్రం మొబైల్ ఇవ్వకుండా అడ్డుపడ్డుతుంది. పైగా నీళ్లలోకి తోస్తోంది. నవ్వులు తెప్పించే ఈ వీడియో (Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరు కూడా వాచ్ చేయండి మరి.
https://twitter.com/Figensport/status/1651181802914996224
Also Read: Bhumika Chawla: యంగ్ హీరోలతో రొమాన్స్ చేసేందుకు నేను రెడీ: భూమిక చావ్లా