Site icon HashtagU Telugu

Gujarat : క్లాస్ రూమ్‌లో కూలిన గోడ..పరుగులు పెట్టిన విద్యార్థులు

Classroom Wall Collapses In

Classroom Wall Collapses In

ఒక్కోసారి సడెన్ గా ప్రమాదాలు జరుగుతుంటాయి. అప్పటి వరకు అంత సంతోషంగా ఉన్న వారంతా ఒక్కసారిగా విషాదంలో మునిగేలా చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో పురాతన ఇల్లులు కూలిపోవడం…నిర్మాణంలో ఉన్న భవనాలు కూలిపోవడం వంటి సంఘటనలు ఎన్నో జరుగుతాయి. నిద్రలో ఉన్న వారు నిద్రలోనే ప్రాణాలు పోతాయి. తాజాగా ఓ స్కూల్ లో గోడ కూలి విద్యార్థులను (Classroom wall collapses) గాయాలపాలు చేసింది. ఈ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

గుజరాత్‌ (Gujarat) వడోదర(Vadodara)లోని శ్రీ నారాయణ్‌ గురుకుల స్కూల్ (Shree Narayan Gurukul School) లో శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో విద్యార్థులు భోజనం చేస్తున్నారు. మొదటి అంతస్థులోని 7వ తరగతి గదిలో విద్యార్థులంతా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటుంటూ భోజనం చేస్తుండగా… ఒక్కసారిగా తరగతి గది గోడ కూలిపోయింది. దీంతో ఆరుగురు విద్యార్థులు మొదటి ఫ్లోర్‌ నుంచి కిందపడిపోయారు. శిథిలాలు వారిపై పడటంతో గాయపడ్డారు. స్థానికులు హుటాహుటిని అక్కడికి చేరుకుని వారిని హాస్పటల్ కు తరలించారు. పాఠశాల బిల్డింగ్‌ కట్టి 14 నుంచి 15 ఏళ్లు అవుతుందని స్థానిక సంస్కృత టీచర్‌ తెలిపారు. ఆ బిల్డింగ్‌ పాడైపోతుందని పాఠశాల యాజమాన్యానికి కూడా తెలుసని.. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. గోడ పార్కింగ్‌ ప్రాంతంలో పడిందని, దీంతో సైకిళ్లు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ఇదంతా క్లాస్‌ రూమ్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ప్రస్తుతం ఆవీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Read Also : Jagan Dharna : జగన్ ధర్నా ఫై చంద్రబాబు సెటైర్లు