Viral Video: సమ్మర్ ఎఫెక్ట్.. స్విమ్మింగ్ పూల్‌గా మారిన క్లాస్‌రూం, వీడియో వైరల్

  • Written By:
  • Updated On - April 30, 2024 / 12:28 PM IST

Viral Video: పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య ఉత్తరప్రదేశ్ లోని ఓ పాఠశాలలో విద్యార్థుల హాజరు కోసం తరగతి గదిని స్విమ్మింగ్ పూల్ గా మార్చారు టీర్లు. కొందరు పిల్లలు తరగతి గదిలోని ఒక మూల నుంచి మరో మూలకు ఈత కొడుతూ కేరింతలు చేస్తుండగా, మరికొందరు ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకున్న వీడియో ఒకటి ట్విటర్లో చక్కర్లు కొడుతోంది. పంట కోతలు, వడగాల్పుల కారణంగా విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరవుతున్నందున , పాఠశాలకు రప్పించేందుకు టీచర్లు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు.  ఈ చర్య తీసుకున్నట్లు పాఠశాల అధికారులను పిల్లల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.

పిల్లలు స్కూల్ యూనిఫాం ధరించారు. తరగతి గదిని మొదట ఖాళీ చేసి, టేబుళ్లు, కుర్చీలను తొలగించి, ఈత కొలనుగా మార్చి పిల్లలు ఈత కొట్టేందుకు అనుమతి ఇచ్చారు. కాగా రాష్ట్రంలో వడగాల్పుల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా తీసుకుంటున్నారు. రాజధాని లక్నోలో సోమవారం 2.1 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలతో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ కనిష్ట ఉష్ణోగ్రత 24.6 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.