Site icon HashtagU Telugu

Video Viral: పాఠశాలలో బిల్డింగ్ నుంచి దూకేసిన చిన్నారి.. వీడియో వైరల్?

Video Viral

Video Viral

ఇటీవల కాలంలో స్కూల్ పిల్లలు ఎక్కువ శాతం మంది ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా స్కూల్ యాజమాన్య సిబ్బంది పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి చాలా వరకు విద్యార్థులకు ప్రమాదలు జరగడానికి కారణం అవుతున్నాయి.. తాజాగా కూడా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక చిన్నారి ఒకటవ అంతస్తు నుంచి దూకి కింద పడిపోతూ ఉన్న అక్కడ చుట్టూ ఎంతమంది పిల్లలు స్టాఫ్ ఉన్నా కూడా ఆ చిన్నారిని కిందకు దూకు వద్దని వద్దు అని చెప్పకపోవడం ఆశ్చర్యపోవాల్సిన విషయం.

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే.. ఈ సంఘటన కాన్పూర్ జిల్లాలోని ఒక పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ సంఘటన జూలై 19న జరిగగా అది కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారి బాబుపూర్వా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. చిన్నారి తల్లిదండ్రులు ఉదయాన్నే స్కూల్‌కి దింపారు. మధ్యాహ్నం పాఠశాలలో భోజనం చేశారు. ఈ సమయంలో కొందరు పిల్లలు లంచ్‌లో బిజీగా ఉన్నారు. కొందరు కూల్ ఆవరణ ప్రాంతంలో ఆడుకుంటూ కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో స్కూల్ మొదటి అంతస్తులో ఒక పిల్లాడు నిలబడి ఉన్నాడు. ఉన్నట్టుండి రైలింగ్ ఎక్కడానికి వెళ్లాడు.

 

అయితే ఆ చిన్నారి అలా చేస్తున్న కూడా అతని వైపు ఎవరూ చూడలేదు. ఫోటో అంతస్తులో ఉన్న రైలింగ్ ఎక్కిన తర్వాత, పిల్లవాడు అకస్మాత్తుగా దూకాడు. అయితే లాన్‌లో ఆడుకుంటున్న ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు పిల్లల వద్దకు పరిగెత్తారు. హడావుడిగా హాస్పిటల్ కి తీసుకెళ్తారు. చిన్నారి నోరు, కాలుకు గాయమైనట్లు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన కిద్వాయ్ నగర్ పోలీస్ స్టేషన్‌లోని డాక్టర్ వీరేంద్ర స్వరూప్ ఎడ్యుకేషన్ సెంటర్‌కు చెందినది. వైరల్‌గా మారిన వీడియో చూసి స్కూల్‌ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. పిల్లవాడు చాలా చిన్నవాడు.

Exit mobile version