Site icon HashtagU Telugu

HYD RTC ‘X’ : బావర్చీ చికెన్ బిర్యానీలో సిగరెట్ పీక..

Cigarette In Bawarchi Birya

Cigarette In Bawarchi Birya

బిజీ లైఫ్ కు అలవాటుపడ్డ జనాలు..ఉదయం లేచిన దగ్గరి నుండి నిద్రపోయేవరకు ప్రతిదీ బయటనే తింటూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. బిజీ లైఫ్ లో కష్టపడి సంపాదించిందంతా కూడా హాస్పటల్ లో పెట్టి చివరకు ప్రాణాప్రాయం నుండి కొంతమంది బయటపడుతుండగా..మరికొంతమంది ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో చాలామంది తప్పులు చేస్తున్నారు. రుచికరమైన ఆహారం అని చెప్పి..ఫుల్ గా లాగుచేస్తూ అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. జనాల డిమాండ్ తో హోటల్స్ వారు సైతం ఎలాంటి నియమాలు పట్టించకుండా ఏదిపడితే అది వేస్తే వస్తున్నారు. ఈ మధ్య తెలంగాణ లో ఫుడ్ అధికారులు ఎప్పటికప్పుడు హోటల్స్ పై దాడులు చేసి ఆహార నియమాలు పాటిస్తున్నారా..? లేదా..? అనేది చెక్ చేసి వాటిపై కేసులు పెడుతున్నారు. అయినప్పటికీ కొన్ని హోటల్స్ లలో దారుణాలు వెలుగులోకి వస్తూ భోజన ప్రియులకు షాక్ ఇస్తున్నాయి.

తాజాగా హైదరాబాద్ RTC X రోడ్ లోని బావర్చి హోటల్ (Cigarette Butt Found in Biryani at Famous Hyderabad Bawarchi Restaurant) లో బిర్యానీ లో సగం తాగేసిన సిగిరెట్ పీక ప్రత్యేక్షమై కస్టమర్లకు షాక్ ఇచ్చింది. బిర్యానీ తినేందుకు కొంత మంది ఫ్రెండ్స్ తో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావార్చి హౌస్ కు వెళ్లారు. అక్కడ బిర్యానీ ఆర్డర్ చేశారు. ఆ తర్వాత వారికి బిర్యానీలో ఏదో వెరైటీగా కన్పించింది.ఏంటని చూడగా.. అది సిగరేట్ పీక. దీంతో వారంతా షాక్ కు గురై..హోటల్ యజమాన్యాని నిలదీశారు. బావార్చి సిబ్బంది మాత్రం.. అస్సలు పట్టనట్టుగా.. మరో బిర్యానీ ఇస్తామని కూడా సింపుల్ గా చెప్పినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Read Also : IPL 2025 Auction: ఈ ఆటగాళ్ల‌పై కాసుల వ‌ర్షం కురిపించిన జ‌ట్లు.. ఈ బౌల‌ర్‌కు ఆర్సీబీ భారీ ధ‌ర‌!