Childhood Friends : 18ఏళ్ల త‌రువాత ఇన్‌స్టాగ్రామ్‌లో క‌లిసిన చిన్న‌నాటి స్నేహితులు..

చిన్న‌నాటి స్నేహితులు(Childhood Friends) సైతం పెద్ద‌యిన త‌రువాత సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాంల వేదిక‌గా క‌లుసుకుంటూ త‌మ చిన్న‌నాటి గుర్తుల‌ను నెమ‌ర‌వేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘ‌ట‌న ఒకటి చోటు చేసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Childhood friends meet through Instagram after 18 years

Childhood friends meet through Instagram after 18 years

సోష‌ల్ మీడియా(Social Media) అంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత ఎక్క‌డివారైనా నేరుగా త‌మ అభిప్రాయాల‌ను పంచుకుంటున్నారు. చిన్న‌నాటి స్నేహితులు(Childhood Friends) సైతం పెద్ద‌యిన త‌రువాత సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాంల వేదిక‌గా క‌లుసుకుంటూ త‌మ చిన్న‌నాటి గుర్తుల‌ను నెమ‌ర‌వేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘ‌ట‌న ఒకటి చోటు చేసుకుంది. 18ఏళ్ల క్రితం నేహ‌, ల‌క్షిత ఎల్‌కేజీ నుంచి ఫ్రెండ్స్‌. ఇద్దరు కలిసి కొన్ని రోజులు చదువుకున్నారు. స్కూల్ చ‌దువులు అయిపోయిన త‌రువాత వారు విడిపోయారు. ఆ త‌రువాత వారు వివిధ ప్రాంతాల్లోకి వెళ్లిపోయారు. ఇటీవ‌ల నేహాకి త‌న చిన్నాటి స్నేహితురాలైన‌ ల‌క్షిత‌ను క‌లుసుకోవాల‌ని అనిపించింది. అందుకోసం ఇన్ స్టాగ్రామ్‌(Instagram)లో వెత‌క‌డం మొద‌లు పెట్టింది.

ల‌క్షిత‌తో స్కూల్‌లో చిన్నప్పుడు దిగిన గ్రూప్ ఫొటోల‌ను నేహ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ల‌క్షిత పేరుతో ఉన్న అంద‌రికీ దానిని పంపించింది. అయిన ల‌క్షిత జాడ తెలియ‌లేదు. ఇన్ స్టాగ్రామ్‌లో ‘ఫైండింగ్ లక్షిత’ అనే అకౌంట్ క్రియేట్ చేసి ‘నేను చాలాకాలంగా చిన్ననాటి స్నేహితురాలిని వెతికే పనిలో ఉన్నాను. నా చిన్న‌నాటి స్నేహితురాలి పేరు లక్షిత. ప్ర‌స్తుతం వయస్సు 21ఏళ్లు. తన బ్రదర్ కునాల్’ అని బయోలో రాసింది. 2006లో మా స్నేహం ఎంతో అద్భుతంగా కొన‌సాగింది. త‌ను ఆ త‌రువాత జైపూర్ వెళ్లిపోయింది. ఆ త‌రువాత నాకు కాంటాక్ట్ లో లేదు. త‌న ఇంటిపేరు తెలియ‌దు అని తెలిపింది. చివ‌రికి నేహ ప్ర‌య‌త్నం ఫ‌లించింది.

ల‌క్షితను క‌నుగొన్న త‌రువాత నేహా ఇలా రాసింది.. నిన్ను క‌నుక్కోవ‌డం చాలా క‌ష్ట‌మైంది. 18 సంవ‌త్స‌రాలు నీతో ట‌చ్‌లో లేనంటే నాకు ఆశ్చ‌ర్యంగా ఉంది అని పేర్కొంది. ఆ త‌రువాత వీరిద్ద‌రూ వారి చిన్న‌నాటి గుర్తుల‌ను ఇన్ స్టాగ్రామ్ వేదిక‌గా పంచుకున్నారు. వీరి స్నేహాన్ని చూసిన ఇన్‌స్టాగ్రామ్ నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో వారిద్ద‌రికి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు.

 

Also Read : Lucky Chair : కుర్చీ కొని కోటీశ్వరుడు అయ్యాడు.. ఎలా ?

  Last Updated: 11 Jun 2023, 09:41 PM IST