Site icon HashtagU Telugu

CEO Suchana Seth: కొడుకును హత్య చేసిన స్టార్టప్ చీఫ్ పోలీస్ కస్టడీకి అనుమతి

CEO Suchana Seth

CEO Suchana Seth

CEO Suchana Seth: నార్త్ గోవాలోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసిందన్న ఆరోపణలపై అరెస్టయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మంగళవారం గోవా కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం ఆమెను కోర్టు ఆరు రోజుల పోలీసు కస్టడీకి పంపించింది.

39 ఏళ్ల వ్యాపారవేత్త సూచనా సేథ్ కాండోలిమ్‌లోని సర్వీస్ అపార్ట్‌మెంట్‌లోని ఒక గదిలో తన కొడుకుకు ఉరేసి, ఆ తర్వాత ఆమె ఎడమ మణికట్టును కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు సీనియర్ పోలీసులు తెలిపారు. ఈ దారుణమైన హత్య వెనుక ఉద్దేశం ఏంటనేది తెలియరాలేదు, అయితే సేథ్ పోలీసుల విచారణలో ఆమెతో తన భర్త దూరంగా ఉన్నారని మరియు ప్రస్తుతం వారి విడాకుల విచారణలు జరుగుతున్నాయని చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడుకును హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టి ట్యాక్సీలో బెంగళూరుకు వెళ్ళింది. అపార్ట్‌మెంట్ హౌస్ కీపింగ్ సిబ్బంది ఆమె బస చేసిన గదిని శుభ్రం చేసేందుకు వెళ్లగా టవల్‌పై రక్తపు మరకలు కనిపించాయని, దీంతో సర్వీస్ అపార్ట్‌మెంట్ నిర్వాహకులు కలంగుట్ పోలీసులకు సమాచారం అందించారు.

కుమారుడి హత్య కేసులో సీఈవో నిందితురాలిని 6 రోజుల పోలీసు కస్టడీకి పంపారు. ఆమెపై భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 302 (హత్య), 201 (సాక్ష్యం మాయం), అలాగే పిల్లల చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. పోలీసు సూపరింటెండెంట్ నిధిన్ వల్సన్ మాట్లాడుతూ మహిళ పశ్చిమ బెంగాల్‌కు చెందినది మరియు బెంగళూరులో నివసిస్తుందని, ఆమె భర్త కేరళకు చెందినవాడని తెలిపాడు.

Also Read: Saturday Puja Tips: శని దోష నివారణ కావాలంటే శనివారం ఆంజనేయస్వామిని అలా పూజించాల్సిందే?