Site icon HashtagU Telugu

Garlic : వెల్లుల్లికి కాపలా…పొలాల్లో CCTVలతో నిఘా

Cctv Cameras Installed In G

Cctv Cameras Installed In G

వెల్లుల్లి (Garlic )..ఈ పేరు వింటే చాలు సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్ (Market) లలో ఏ వస్తువు కొనాలన్నా అలోచించి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సంపాదన వందల్లో ఉంటె..ఖర్చు వేలల్లో ఉంటుంది. దీంతో సగటు మనిషి అప్పుచేసి..బ్రతుకే రోజులు ఏర్పడ్డాయి. రోజురోజుకు నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చోవడంతో ఏమి తిని బ్రతకాలని గగ్గోలు పెడుతున్నారు. మొన్నటి వరకు టమాట, ఉల్లిపాయల ధరలు కన్నీరు పెట్టించగా..ఇప్పుడు వెల్లుల్లి చూస్తేనే ఏడుపొస్తుంది..అంతలా వాటి ధర పెరిగిపోయింది. ప్రస్తుతం మార్కెట్ లో కేజీ వెల్లుల్లి ధర రూ.600 పలుకుతుంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెపుతున్నారు. దీంతో రైతులు..దొంగల బారినుండి వెల్లుల్లి కాపాడుకునే పనిలో పడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

పొలాల్లో పలు చోట్ల CC కెమెరాలు (CC Camara) ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. వెల్లుల్లి ధరలు (Garlic Price) కొండెక్కడం తో చాలాచోట్ల దొంగలు వెల్లుల్లి ని ఎత్తుకుపోతున్నారు. రాత్రిపూట పొలాల్లో వెల్లుల్లిని దొంగతనం చేసి మార్కెట్ లో అమ్ముకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ఛింద్వాడా​లోని మోహ్​ఖేడ్​లోని రైతులు జాగ్రత్త పడుతున్నారు. ఈ ఏడాది రైతులకు వెల్లుల్లి పంట మంచి లాభాలు ఇస్తుండడం తో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ..వాటిని కాపాడుకునే పనిలో పడ్డారు.

ఛింద్వాడాలో లక్షా 30 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు పండుతాయి. ఈ ఏడాది వెల్లుల్లిని మాత్రం 1500 హెక్టార్లలోనే పండించారు రైతులు. విస్తీర్ణం పరంగా గతేడాది కంటే ఇది చాలా తక్కువ. రైతులకు గతేడాది సరైన గిట్టుబాటు ధర దక్కని నేపథ్యంలో ఈ సంవత్సరం వెల్లుల్లి పంట వేసేందుకు చాలా మంది వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెల్లుల్లికి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులు పంటను కాపాడుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుమారు 5 నుంచి 7 గ్రామాల రైతులు తమ పొలాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Read Also : Parchur Constituency: వైసీపీ నుంచి పర్చూరులో పోటీ చేసేవారే లేరా..?