Site icon HashtagU Telugu

America: రెండో అంతస్తులోకి దూసుకెళ్లిన కారు.. అసలేం జరిగిందంటే?

America

America

మామూలుగా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. దీంతో నిత్యం ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన ఒక యాక్సిడెంట్ కాస్త నవ్వు తెప్పించేదిగా ఉంది. అమెరికాలోని పెన్సిల్వానియాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక కారు డ్రైవర్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆశ్చర్యకరంగా పక్కన ఉన్న బిల్డింగ్ రెండో అంతస్తులోకి దూసుకెళ్లాడు.

కారు పరిమాణంలో బిల్డింగ్ పైభాగంలో పెద్ద రంధ్రం కూడా పడింది. వెంటనే ఫైర్ ఫైటర్లు రంగంలోకి దిగి కారును, కారు డ్రైవరును జాగ్రత్తగా కిందకు దించారు. బిల్డింగ్ లోకి దూసుకెళ్లిన కారు దృశ్యాలు, శిధిలమైన బిల్డింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. పెన్సిల్వానియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కారును 20 ఏళ్ల యువకుడు డ్రైవింగ్ చేస్తున్నాడని ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయని తెలిపారు. ప్రస్తుతం అతడు అక్కడికి సమీపంలోనే ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు వారు వెల్లడించారు. అతడు కోలుకుంటే గానీ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందో తెలియదని అన్నారు.

 

అయితే ఈ ప్రమాదం పై అక్కడి స్థానికులు అనేక రకాల అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. దగ్గర్లోని కల్వర్టు వద్ద ఓవర్ స్పీడింగ్ వలన రైలింగును ఢీకొని ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆ కారణంతోనే కారు గాల్లోకి లేచి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.