Viral Video : ఫ్రీ గా మద్యం బాటిళ్లు దొరకడంతో పండగ చేసుకున్న జనాలు

లోపల మద్యం బాటిళ్లు కనిపించడంతో సాయం చేసేందుకు వచ్చిన వారంతా బాటిళ్లను తీసుకుని పరుగులు పెట్టారు. అది చూసి మరికొందరు కారు వద్ద గుమిగూడడంతో

Published By: HashtagU Telugu Desk
Top 10 Car Accidents

Top 10 Car Accidents

ఫ్రీగా ఫినాయిల్ దొరికితేనే వదలని జనాలు..ఫ్రీగా మద్యం బాటిళ్లు లభిస్తే వదులుతారా..? అదికూడా ఎన్నికల సమయంలో..అందినకాడికి పట్టుకొని వెళ్లారు. క్షణాల్లో మద్యం బాక్స్ లన్ని ఖాళీగా దర్శనం ఇచ్చాయి. ఈ ఘటన బిహార్‌ (Bihar’s Gaya district)లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

ఓ కారులో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే వేగంగా వెళుతున్న ఆ కారు (Car) మరో వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం (Accident) జరగడంతో అక్కడి వారంతా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అప్పటికే అందులో ఉన్న వారు కారును వదిలి పారిపోయారు. అయితే.. లోపల మద్యం బాటిళ్లు కనిపించడంతో సాయం చేసేందుకు వచ్చిన వారంతా బాటిళ్లను తీసుకుని పరుగులు పెట్టారు. అది చూసి మరికొందరు కారు వద్ద గుమిగూడడంతో రహదారిపై గందరగోళ వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మద్యం బాటిళ్లను అక్రమంగా తీసుకెళ్లిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రేమ్ ప్రకాశ్ వెల్లడించారు.

Read Also : King Nagarjuna: ఇండియా సినిమాటిక్ క్యాపిటల్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది: కింగ్ నాగార్జున

  Last Updated: 01 Nov 2023, 03:31 PM IST