Thumbs Up Emoji: ఆ ఒక్క ఏమోజితో రైతు జీవితం తారుమారు.. రూ. 50 లక్షలు జరిమానా?

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ వినియోగిస్తున్నారు. రాను రాను వాట్సాప్ లో ఎమోజీస్ వినియో

  • Written By:
  • Publish Date - July 11, 2023 / 06:30 PM IST

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్ వినియోగిస్తున్నారు. రాను రాను వాట్సాప్ లో ఎమోజీస్ వినియోగం పెరిగిపోవడంతో చాటింగ్ చేయడానికి బదులు ఎక్కువగా ఎమోజీస్ ని ఉపయోగిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఎమోజీ కారణంగా ఏకంగా 50 లక్షలు జరిమానా పడింది. అసలేం జరిగిందంటే.. కెనడాలోని క్రిస్‌ అచ్టర్‌ అనే రైతు ఒక కొనుగోలుదారుతో ఫోన్‌లో మెసేజ్‌లతో సంప్రదింపులు చేశాడు. అతను సుమారు 86 టన్నుల అవిసె గింజలు కొనగోలు చేస్తానని, కేజి రూ.1048 చొప్పున చేసి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు.

అందుకు సదరు రైతు కూడా అంగీకరించడమే కాకుండా నవంబర్‌ లోపు డెలివరి చేస్తానని ఒప్పుకున్నాడు. ఇద్దరి మధ్య ఒప్పందం ఖరారయ్యినట్లే కదా అని అడగగా ధృవీకరిస్తున్నట్లుగా రైతు ఈ థంబ్స్‌ అప్‌ ఎమోజీని పంపాడు. దీంతో సదరు కొనుగోలుదారుడు ఒప్పందం ఖరారయ్యిందని అనుకున్నాడు. కానీ సీన్ కట్ చేస్తే అనుకున్న సమయానికి రైతు అవిసె గింజలు పంపిణీ చేయలేదు. దీంతో కొనగోలుదారుడు రైతుని ప్రశ్నించగా తాను కాంట్రాక్ట్‌ తీసుకుంటున్నా అని ధృవీకరించానేగాని డెలివరీ చేస్తానని ఎక్కడ చెప్పలేదని వాదించాడు.

దీంతో కోర్టుని ఆశ్రయించారు ఇద్దరూ కొనగోలుదారుడు ఒప్పందాన్ని నెరవేర్చలేదని మెసేజ్‌ల స్క్రీన్‌ షాట్‌ ఆదారాలను కోర్టుకి సమర్పించాడు. కాంట్రాక్ట్‌ను అందుకుంటున్నట్లుగా ఆ గుర్తుని పంపిచానని చెప్పాడు. అయితే కాంట్రాక్ట్‌ తీసుకుంటున్నట్లు నిరూపించేలా ఏ ఆధారాన్ని సమర్పించలేకపోయాడు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కొనుగోలుదారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమోదాన్ని సూచించడానికి ‘థంబ్స్‌ అప్‌ ఎమోజి ని సాధారణంగా ఉపయోగిస్తారని పేర్కొంది. అలాగే డిక్షనరీ.కమ్ అందించిన ఎమోజీ నిర్వచనాన్ని కూడా ప్రస్తావిస్తూ డిజిటల్‌ కమ్యూనికేషన్‌లో ఒప్పందం ఆమోదం లేదా ప్రోత్సాహాన్ని వ్యక్తికరించడానికి ఈ ఎమోజీని ఉపయోగిస్తామని స్పష్టం చేసింది.​ వారి ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించడమే గాక అంగీకరించలేదని వాదించినందుకు గానూ రైతుకి ఏకంగా రూ. 50,88,893/-లు జరిమానా విధించింది కోర్టు.