Site icon HashtagU Telugu

Plane: విమానం రెక్కలపై డ్యాన్సులు చేసిన సిబ్బంది.. వీడియో వైరల్?

Plane

Plane

మామూలుగా నిత్యం సోషల్ మీడియాలో కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని కోపం తెప్పించేవిగా మరికొన్ని బాధ కలిగించేవి కూడా ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు కొంతమంది చేసే అల్లరి పనుల వల్ల వారి ఉద్యోగాలు కూడా పోవచ్చు. తాజాగా కూడా కొందరు అలాంటి పనే చేశారు. చూడడానికి ఫన్నీగా ఉన్న ఆ వీడియోపై విమాన అధికారులు మండిపడ్డారు.

అసలేం జరిగిందంటే… బోయింగ్ 777 విమానం ఎయిర్‌పోర్టులో ఆగింది. ఈ క్రమంలో ఒక మహిళా సిబ్బంది విమానం రెక్కపై డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత అధికారిగా కనిపించే మరో వ్యక్తి కూడా బాడీ బిల్డింగ్ పోజులు ఇచ్చారు. ఈ దృశ్యాలను విమానం కోసం టెర్మినల్ వద్ద వేచి చూస్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇది కాస్త వైరల్‌గా మారి స్విస్ ఇంటర్నేషనల్‌ ఎయిర్ పోర్టు యాజమాన్యానికి చేరింది.

 

బోయింగ్ విమానం రెక్క ఐదు మీటర్ల వెడల్పు, 16.4 మీటర్ల ఎత్తు ఉంటుంది. అంత ఎత్తు నుంచి కిందపడితే తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుందని ఎయిర్‌ పోర్టు యాజమాన్యం తెలిపింది. సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడితే క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. చూడటానికి సరదాగా అనిపించినా ఇలాంటి ఘటనలు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోని చూసినందుకు ఫన్నీగా స్పందిస్తుండగా మరికొందరు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసే అనవసరంగా ప్రాణాల మీదికి తెచ్చుకోకండి అంటూ కామెంట్ చేస్తున్నారు.