ఎండలు దంచికొడుతున్నాయి..ఈ ఎండా వేడిని తట్టుకునేందుకు మందు బాబులు చల్లటి బీర్లు తాగుతూ ఉపశమనం అవుతున్నారు. ఇలాంటి ఈ సమయంలో ఒక బీర్ కొంటే మరొకటి ఫ్రీ (One plus one beer) అంటూ వైన్ షాప్స్ బోర్డు లు పెట్టడం మందుబాబులకు డబుల్ కిక్ ఇస్తుంది.కాకపోతే ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు..ఉత్తరప్రదేశ్ లో.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఏప్రిల్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ (New Liquor Policy) అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మద్యం దుకాణాలు స్టాక్ క్లియరెన్స్ సేల్ ప్రకటించాయి. ముఖ్యంగా బ్రాందీ, విస్కీలపై 50% నుంచి 70% వరకు భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. అంతేకాదు బీర్లకు 1+1 ఆఫర్లు ప్రకటించడంతో మద్యం ప్రియులు దుకాణాల వద్ద బారులు తీరారు. సాధారణ ధరలతో పోలిస్తే కొన్ని బ్రాండెడ్ మద్యం బాటిల్స్ 70% తక్కువ ధరకే లభిస్తున్నాయి.
MAD Square : ‘మ్యాడ్ స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్స్
ఈ భారీ డిస్కౌంట్ల కారణంగా మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగాయి. కొంతమంది వ్యాపారులు రూ.3,000 విలువైన మద్యం బాటిళ్లను కేవలం రూ.1,000కే విక్రయిస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన ఆఫర్లను విన్న వినియోగదారులు మద్యం దుకాణాల ముందు క్యూ కట్టారు. ఈ క్లియరెన్స్ సేల్ వల్ల సాధారణ రోజుల్లో కంటే దుకాణదారులకు 40% ఎక్కువ వ్యాపారం జరిగిందని సమాచారం.
ఈ భారీ తగ్గింపుల కారణంగా కొందరు వినియోగదారులు ఎక్కువ మద్యం నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కొత్త పాలసీ అమల్లోకి రాకముందే వ్యాపారులు తమ స్టాక్‌ను ఖాళీ చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే తక్కువ ధరల కారణంగా మద్యం అమ్మకాలు విపరీతంగా పెరగడం, వినియోగదారుల ఆసక్తి దృష్ట్యా ఇది మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.