Tomatoes Free for Mobile Phone : మొబైల్ ఫోన్ కొంటే 2 కిలోల టమాటాలు ఫ్రీ.. భలే ఆఫర్, ఫుల్ బిజినెస్..

ఏరియాని బట్టి టమాటా కేజీ 100 రూపాయల నుండి 250 రూపాయల వరకు పలుకుతుంది. ఇక కొన్ని చోట్ల టమాటా దొరకడం కూడా కష్టమైంది.

Published By: HashtagU Telugu Desk
Buy Mobile Phones and get free 2 kilo tomatos

Buy Mobile Phones and get free 2 kilo tomatos

దేశంలో టమాటా(Tomato) రేట్లు ఏ రేంజ్ లో ఉన్నాయో గత వారం రోజులుగా అందరం చూస్తూ ఉన్నాం. ఏరియాని బట్టి టమాటా కేజీ 100 రూపాయల నుండి 250 రూపాయల వరకు పలుకుతుంది. ఇక కొన్ని చోట్ల టమాటా దొరకడం కూడా కష్టమైంది. ప్రజలు క్యూలైన్స్ లో నిల్చొని మరీ టమాటాలు కొనుక్కుంటున్నారు. ఇలాంటి కష్టమైన పరిస్థితిని ఓ వ్యాపారవేత్త తన స్టైల్ లో ఆలోచించి తన బిజినెస్(Business) కి అనుకూలంగా మార్చుకున్నాడు.

మధ్యప్రదేశ్(Madhyapradesh) లో అశోక్ నగర్ కి చెందిన అభిషేక్ అగర్వాల్ కి ఓ మొబైల్ షాప్ ఉంది. టమాటాలు రేట్లు పెరగడంతో తన షాప్ లో మొబైల్ ఫోన్స్(Mobile Phones) కొన్న వాళ్లకి రెండు కిలోలు టమాటాలు ఫ్రీ అని ప్రకటించాడు. ఈ ఆఫర్ ని బ్యానర్స్ వేసి షాప్ బయట కట్టి మరీ ప్రమోట్ చేశాడు. కొంతమంది ఇదేం ఆఫర్ అనుకున్నా కొంతమంది మాత్రం ఆ మొబైల్ షాప్ కి వెళ్లి ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు కొంటున్నారట టమాటాలు కోసం.

ఈ ఆఫర్ ప్రకటించిన తర్వాత తన షాప్ లో సేల్స్ కూడా పెరిగాయని అభిషేక్ అగర్వాల్ చెప్పాడు. ఓ పక్కన టమాటా రేట్లతో అంతా బాధపడుతుంటే ఇతను మాత్రం దానిని తనకు అనుకూలంగా మార్చుకొని బిజినెస్ పెంచుకుంటూనే వైరల్ కూడా అవుతున్నాడు అభిషేక్ అగర్వాల్. దీంతో ఇతని తెలివితేటలకు నెటిజన్లు అభినందిస్తున్నారు. తమ దగ్గర కూడా ఇలాంటి ఆఫర్లు పెడితే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారు.

 

Also Read : Use Emojis Carefully : ఎడాపెడా ఎమోజీ వాడినందుకు 50 లక్షలు కట్టాల్సి వచ్చింది

  Last Updated: 09 Jul 2023, 07:28 PM IST