Site icon HashtagU Telugu

Bull Climbed : రోడ్ల ఫై తిరగాల్సిన ఆంబోతు..బిల్డింగ్ పైకి ఎక్కింది ..ఎక్కడంటే..!

Bull Climbed On Building Du

Bull Climbed On Building Du

రోడ్లపై తిరగాల్సిన ఆంబోతు (Bull Climbed)..ఏకంగా బిల్డింగ్ (Building ) పైకి ఎక్కి ఎటు వెళ్లాలో తెలియక అక్కడే నిల్చున్న ఘటన పాలకొల్లు (Palakollu) లో జరిగింది. గత రెండు రోజులుగా ఏపీలో విస్తారంగా వర్షాలు (Rains) పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇంటికే పరిమితం అయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. ఇక మూగజీవాలు సైతం వర్షాలు పడుతుండడంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియడం లేదు.

ఈ క్రమంలో పాలకొల్లు కోర్టు సెంటర్‌లో ఓ ఆంబోతు బిల్డింగ్‌పైకి ఎక్కింది. బిల్డింగ్ గేటు తీసే ఉండటంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్లింది. కారిడార్‌లోకి వెళ్లాక ఎటు వెళ్లాలో తెలియకపోవడంతో దాదాపు 12 గంటలపాటు అక్కడే నిల్చుని ఉంది. ఇది చూసిన స్థానికులు స్థానిక యానిమల్ వారియర్ కన్జర్వెన్సీ సోసైటీ సభ్యులకు సమాచారం ఇవ్వగా..వారు అక్కడికి వచ్చి కిందకు దింపాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అక్కడే ఉన్న గదుల తాళాలు తెప్పించి వాటి తలుపులు తీసి అతి కష్టం మీద జాగ్రత్తగా పై ఫ్లోర్ నుండి కిందకి మెట్లు గుండా దింపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఆంబోతు గత కొద్దీ నెలలుగా కోర్ట్ సెంటర్ లో తిరుగుతూ ఉంటుందని చెపుతున్నారు. మార్కెట్ లో కూరగాయలు , ఎవరైనా ఏమైనా ఇస్తే తినుకుంటా..రోడ్ పక్కన పడుకుంటుందని చెప్పుకొచ్చారు. గత రెండు రోజులుగా వర్షాలు పడుతుండడం , రోడ్ల ఫై నీరు ప్రవహిస్తుండడం తో ఆంబోతు (Bull Climbed) ఆలా బిల్డింగ్ పైకి ఎక్కి ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద ఆంబోతు క్షేమంగా కిందకు రావడంతో హమ్మయ్య అనుకున్నారు.

Read Also: Road Accident : నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి