Site icon HashtagU Telugu

Influencer Larissa: ఆమె ఓ ఫిట్నెస్ ఫ్రీక్.. అందరికీ సలహాలు ఇచ్చింది.. కానీ హార్ట్ అటాక్ తో హఠాన్మరణం!

Mixcollage 04 Dec 2023 04 08 Pm 9410

Mixcollage 04 Dec 2023 04 08 Pm 9410

ఈ మధ్యకాలంలో స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ ఫిట్నెస్ విషయంలో కొంతమంది అజాగ్రత్తగా ఉండటం వల్ల ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో చూసుకుంటే చాలామంది జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ గుండెపోటుతో మరణిస్తున్నారు. వర్కౌట్లు చేస్తూ అతి చిన్న వయసులోనే ఎక్కువగా చనిపోతున్నారు. ఇప్పటికే ఈ లిస్టులో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా ఇదే లిస్ట్ లోకి బ్రెజిలియన్ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ లారిస్సా
బోర్జెస్ కూడా చేరింది.

తరచూ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే వారికి లారిస్సా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 33 వేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె తరచూ చూసిన మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫిట్నెస్ కి ఫ్యాషన్ కి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ అభిమానులకు కూడా జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఈ ఏడాది aఆగస్టు 20న గ్రామాడో యాత్రలో ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆగస్టు 20న ఆస్పత్రిలో చేరిన ఆమె కోమాలోకి వెళ్లిపోయింది.

అలా ఆమె దాదాపు వారం రోజుల పాటు జీవన్మరణ పోరు కొనసాగింది. చివరికి ఆగస్టు 28 సోమవారం రోజు మరణించింది. అయితే ఆమె మరణానికి ఒక వారం రోజుల ముందు, తన గ్రామడో చిత్రాన్ని షేర్ చేస్తూ…నేను రేపటిని నమ్మగలను అని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చింది. అయితే ఫొటోను చాలా మంది నెటిజన్లు లైక్ చేశారు. అలాగే ఆమె 2021 పెర్నాంబుకో పర్యటన ఫొటోని షేర్ చేస్తూ, లారిస్సా కుటుంబం ఇలా రాసింది.. దేవుడు తనకు ఇచ్చినదంతా ఆమె ఆనందించింది. మా ప్రియమైన కుమార్తె, దేవుని వైపు అడుగులు వేసింది. మా హృదయాలు పగిలిపోయాయి. ఈ నష్టం పూడ్చలేనిది. ఆమె ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అని రాశారు. కాగా గ్రామాడో సందర్శనలో మద్యం తో పాటు డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల లారిస్సా కి గుండెపోటు రెండుసార్లు వచ్చిందని ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఆమె మరణానికి అసలు కారణం ఏంటి అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది. ఆమె తిన్న ఆహారాన్ని కూడా ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారు. అయితే లారిస్సా మరణించే సమయానికి ఆమె వయస్సు 33 సంవత్సరాలు మాత్రమే అని తెలిసింది.

Exit mobile version