Site icon HashtagU Telugu

Lovers Romance : ప్రేయసి ఇంటికి వెళ్లిన ప్రియుడు..రూమ్ లో ఉండగా ఎంట్రీ ఇచ్చిన తల్లిదండ్రులు

Boyfriend Escape

Boyfriend Escape

మాములుగా మనం ఎక్కువగా సినిమాల్లో ఇలాంటి తరహా సీన్లు చూస్తుంటాం..ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో బాయ్ ఫ్రెండ్ (Boyfriend ) ను ఇంటికి పిలవడం..సడెన్ గా తల్లిదండ్రులు (Parents) వచ్చేసమయానికి మంచం కింద దాచిపెట్టడం..లేదా ఇంటి గోడ దూకి వెళ్లడం..కిటికీ లో నుండి కిందకు దిగడం వంటివి చూస్తుంటాం. ఆ క్షణం అతడు దొరికిపోతాడేమో అనే టెన్షన్ కు మన గురివుతుంటాం. నిజ జీవితంలో కూడా ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటూ వార్తల్లో నిలుస్తుంటాయి.

తాజాగా ఇలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. తల్లిదండ్రులు ఇంట్లో లేరని..నేను ఒక్కదాన్నే ఉన్నానని..ఎంజాయ్ (Romance) చేద్దాం ఇంటికి రా..అని ప్రియుడికి కబురు పంపింది యువతి. దొరికేందే ఛాన్స్ అన్నట్లు ఆ ప్రియుడు ఇంటికి వచ్చేసాడు. ఇద్దరు రూమ్ లో ఎంజాయ్ చేస్తుండగా..ఇంటి కాలింగ్ బెల్ వినిపించింది. కిటికీ లోనుండి చూడగా..తల్లిదండ్రులు. టెన్షన్ లో ఏంచేయాలో తెలియక..సదరు యువతీ ప్రియుడిని బాల్కనీ నుండి పారిపొమ్మని సలహా ఇచ్చింది. దాంతో గాల్లో తాడు పట్టుకుని వేలాడుతూ కిందకు దిగడం స్టార్ట్ చేసాడు. అతడిని కింది అంతస్తులో గర్ల్‌ఫ్రెండ్ తల్లి పట్టుకొని చీపురుతో చితక్కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి కొంతమంది పాపం అంటే..మరికొంతమంది మంచిగా జరిగిందని కామెంట్స్ వేస్తున్నారు.

Exit mobile version