ప్రస్తుతం దేశభక్తి మరియు స్వదేశీ ఉత్పత్తులపై అవగాహన పెరుగుతున్న ఈ సమయంలో నటి రేణూ దేశాయ్ (Renudeshai) వినిపించిన పిలుపు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చైనా ఉత్పత్తులను (Chinese Products) పూర్తిగా బహిష్కరించాలని కోరారు. “మన దేశం కోసం మనం తీసుకునే చిన్న నిర్ణయం కూడా చాలా ముఖ్యం” అని రేణూ పేర్కొన్నారు. దేశభక్తిని చూపించాలంటే మాటలకే పరిమితం కాకుండా, మన కొనుగోళ్లలో కూడా జాతీయత ప్రతిబింబించాలన్నారు.
Meat: ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసిన మాంసాన్ని తింటున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
అలాగే రేణూ దేశాయ్ తన వ్యక్తిగత జీవితం గురించి మాటాడుతూ.. ఇప్పటివరకు తాను భారతదేశంలో తయారైన వస్తువులనే ఎక్కువగా ఉపయోగించానని తెలిపారు. “మీరు నిజంగా దేశం గురించి ఆలోచిస్తే చైనా వస్తువులను మానండి. చిన్న ప్లాస్టిక్ వస్తువైనా కానీ, మేడ్ ఇన్ చైనా అని ఉంటే దాన్ని కొనొద్దు. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఇదే చెప్పండి” అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక సందేశంలో ఉన్నాయని తెలుస్తోంది.
మేక్ ఇన్ ఇండియా ఉద్యమానికి మద్దతు ఇస్తూ రేణూ చేసిన ఈ పిలుపు ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వేగంగా వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఆమె అభిప్రాయాలను సమర్థిస్తూ స్పందిస్తున్నారు. అయితే, కొన్ని వర్గాలు ఇది ఆచరణలో సాధ్యమేనా? అన్న సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. అయినా, దేశీ ఉత్పత్తులపై నమ్మకాన్ని పెంచేలా, దేశవ్యాప్తంగా చైనా ఉత్పత్తులపై చైతన్యం తీసుకురావడంలో రేణూ పోస్ట్ ముఖ్యపాత్ర పోషిస్తున్నది అనడంలో సందేహమే లేదు.