Site icon HashtagU Telugu

PM Modi-Shah Rukh : ప్రధాని మోడీ, షారుఖ్ ఖాన్‌ డూప్లికేట్ల సమావేశం.. ఫేక్ వీడియో వైరల్

Pm Modi Shah Rukh

Pm Modi Shah Rukh

PM Modi-Shah Rukh : డీప్ ఫేక్ వీడియోలపై భారత ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అలాంటి వీడియోలను పోస్ట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలకు కేంద్ర సర్కారు స్పష్టం చేస్తోంది. ఈక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌లు కలిసి మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్న ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు షారుఖ్ ఖాన్, ప్రధాని మోడీ తరహా వస్త్రధారణలో ఉన్నారు. అయితే వీడియోను ఎడిట్ చేసి.. వారి తలలను షారుఖ్ ఖాన్, ప్రధాని మోడీ తలలతో(PM Modi-Shah Rukh) రీప్లేస్ చేశారు. ఈ ఫేక్ వీడియోను లయీబా ఫిర్దౌస్ (Laibah Firdaus) అనే ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. లయీబా ఫిర్దౌస్ డిసెంబరు 21న ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఇప్పటివరకు  86వేల వ్యూస్ వచ్చాయి. ఇదే వీడియోను డిసెంబరు 22న  Megh Updates అనే ట్విట్టర్ పేజీలో అప్ లోడ్ చేయగా ఇప్పటిదాకా 5.50 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలపై నెటిజన్స్ నుంచి కామెంట్స్, లైక్స్ వెల్లువెత్తాయి.