తెలంగాణ వ్యాప్తంగా దసరా సంబరాలు (Dussehra Celebrations) మొదలయ్యాయి. తెలంగాణ (Telangana) లో దసరా సంబరాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఊరు వాడ , పల్లె , పట్టణం ఇలా అన్ని ప్రాంతాలు దసరా సంబరాలు చేసుకుంటున్నాయి. ఇక దసరా వస్తుందంటే చాలు అనేక ఆఫర్లతో సంస్థలన్నీ కస్టమర్లను ఆకట్టుకునే పనిలో ఉంటాయి. ఇప్పటికే ప్రముఖ ఆన్లైన్ సంస్థలు అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ లలో పలు సేల్స్ నడుస్తున్నాయి. ఇటు షాపింగ్ మాల్స్ సైతం అనేక ఆఫర్లను తీసుకొచ్చాయి. ఇటు హోటల్స్ , రెస్టారెంట్స్ సైతం ప్రత్యేక ఆఫర్లతో కస్టమర్లను క్యూ కట్టెల చేస్తున్నాయి. తాజాగా ఓ హోటల్ వారు కేవలం రూ. 3 లకే బిర్యానీ (Biryani) ఆఫర్ ప్రకటించి అందర్నీ ఆకర్షిస్తున్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో కొత్తగా ప్రారంభించిన అన్ లిమిటెడ్ రెస్టారెంట్ (Unlimited Restaurant) లో కేవలం రూ.3 లకే (RS.3) బిర్యానీ ఆఫర్ పెట్టారు. ఇప్పటికే తాడేపల్లిగూడెం, భీమడోలులో అన్‌లిమిటెడ్ పేరుతో రెండు రెస్టారెంట్లను ఉన్నాయి. వ్యాపారాభివృద్దిలో భాగంగా జంగారెడ్డి గూడెంలో కొత్త బ్రాంచ్ ప్రారంభించింది యాజమాన్యం. ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా భోజన ప్రియులకు కన్నులు చెదిరే బంపర్ ఆఫర్ ప్రకటించారు రెస్టారెంట్ యాజమాన్యం. కేవలం రూ.3 చెల్లిస్తే తిన్నంత బిర్యానీ అని ప్రచారం మొదలుపెట్టారు. రూ. 10 పెట్టిన టీ దొరకని ఈరోజుల్లో..రూ. 3 లకే తిన్నంత బిర్యానీ అంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి. ఇంట్లో ఉన్న వారంతా సదరు రెస్టారెంట్ ముందు క్యూ కట్టారు. కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రెస్టారెంట్ బయట యాజమాన్యం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ ఆఫర్ కేవలం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని షరతు పెట్టారు. కస్టమర్లు క్యూ లైన్లో వచ్చి రూ.3 చెల్లించి బిర్యానీ ప్యాకెట్ తీసుకువెళ్లారు. క్యూ లైన్లో తోపులాట, ఘర్షణలు జరగకుండా ప్రైవేట్ సెక్యూరిటీతో పాటు, పోలీసులు కూడా రంగంలోకి దిగారు. కేవలం మూడు గంటలే ఈ బంపర్ ఆఫర్ ఉండటంతో వేల మంది అక్కడికి వచ్చారు. ఉన్న టైములో బిర్యానీ అందుకున్న వారు సంతోషంగా ఉంటె..బిర్యానీ లభించని వారు మాత్రం నిరాశకు గురయ్యారు.
Read Also : Ideathon 2024 : ఐడియాథాన్ 2024 కు విశేష స్పందన – స్మితా సబర్వాల్