Site icon HashtagU Telugu

Bigg Boss Telugu 7 : కన్నీరు తెప్పిస్తున్న బిగ్ బాస్ శివాజీ ప్రోమో

Shivaji Promo

Shivaji Promo

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu 7)రోజు రోజుకు విపరీతంగా అలరిస్తుంది..సీరియల్ బ్యాచ్ , రైతు బిడ్డ , పాట బిడ్డ , సినీ స్టార్స్ ఇలా అంత కూడా సందడి చేస్తూ అలరిస్తున్నారు. ఇక బిగ్ బాస్ సైతం గత సీజన్ తప్పులు జరగకుండా మొదటి నుండి చక్కటి ప్లాన్ తో ముందుకు తీసుకెళ్తున్నారు. టెన్షన్ పెట్టె నామినేషన్స్ , రసవత్తరగా సాగే గేమ్స్ , మధ్య మధ్యలో భోలే సాంగ్స్ , శోభా అందాల ఆరబోత ఇలా అందరికి సమపాలనలో న్యాయం చేస్తూ షో సక్సెస్ అవుతుంది.

ముఖ్యంగా శివాజీ (Sivaji ) వల్ల షో మరింత ఇంట్రస్ట్ గా మారుతుంది. పూర్తి నెగిటివిటీతో హౌస్‌లోకి వెళ్లి.. అప్పటి వరకూ కొందరి వాడిగానే ఉన్న శివాజీని అందరి వాడిగా మారిపోయారు. హౌస్‌లోకి వెళ్లక ముందు వరకూ ఓలెక్క.. హౌస్‌లోకి వెళ్లిన తరువాత మరో లెక్క అన్నట్టుగా.. శివాజీ పాత లెక్కలన్నింటినీ మార్చేశాడు బిగ్ బాస్. ఇప్పుడు టైటిల్ రేస్‌లో ముందున్న శివాజీకి.. మరో సూపర్ డూపర్ ఎపిసోడ్ పడింది. సోమవారం నామినేషన్ల పక్రియ పూర్తి కాగానే మంగళవారం కు సంబదించిన ప్రోమో రిలీజ్ చేసాడు బిగ్ బాస్. ఆ ప్రోమో వచ్చిన దగ్గరి నుండి ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ ప్రోమోలో శివాజీ కొడుకు (Sivaji Son Sree) హౌస్ లోకి వచ్చి సందడి చేశారు. శివాజిని చెక్ చేయడానికి డాక్టర్ వచ్చారని ఒక రూమ్ లోకి వెళ్ళమన్నాడు బిగ్ బాస్. మొదట డాక్టర్ లా శివాజీకి చెకప్ చేసి అనంతరం నాన్న అంటూ పిలిచి శివాజీని ఆశ్చర్యపరిచాడు. మాస్క్ తీసి.. నాన్నా అని గుండెల్ని హత్తుకోవడంతో శివాజీ కన్నీళ్లు ఆగలేదు. అతనికే కాదు.. చూసేవాళ్లకీ కన్నీళ్లు ఆగలేదు.

We’re now on WhatsApp. Click to Join.

శివాజీ చాలా రోజుల తర్వాత కొడుకుని చూసిన ఆనందంతో ఏడ్చేశాడు. తన కొడుకుని హౌస్ లోకి తీసుకొస్తూ నా కొడుకు అంటూ అందరికి పరిచయం చేశాడు శివాజీ. అందరూ అతనికి గ్రీటింగ్స్ తెలిపారు. ఇక శివాజీ, తన కొడుకు కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. శివాజీ మరోసారి ఎమోషనల్ అయి ఏడ్చేశాడు.
ఆ తండ్రీ కొడుకులు ఒకర్నొకరు పట్టుకుని ఏడుస్తుంటే.. ప్రేక్షకుల గుండె తరుక్కుపోయింది.

నువ్వు వస్తావ్ అనుకోలేదురా.. తమ్ముడొస్తాడనుకున్నా.. నీకు సిగ్గు కదా అని శివాజీ అనడంతో.. ‘యూఎస్ వెళ్లడానికి యూనివర్సిటీ డేట్ 8 వరకూ ఉంది. మళ్లీ నువ్వు వచ్చే ముందు కలవడానికి వీలుంటుందో ఉండదో అని ఇప్పుడే వచ్చేశాను నాన్నా’ అని కొడుకు శ్రీ అనడంతో.. కన్నీళ్లు పెట్టుకున్నారు శివాజీ. ‘చానాళ్లు అయ్యింది నాన్నా’ అని శ్రీ తండ్రిని ఓదార్చడంతో.. తట్టుకోలేకపోయారు శివాజీ.. గట్టిగా ఏడ్చేశారు. ‘ఏడొద్దు నాన్నా.. మీరు ఏడిస్తే ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు.. మీరు నవ్వితే అందరూ నవ్వుతారు.. తండ్రిని ఓదార్చిన విధానం చూస్తే.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు శివాజీ కొడుకు శ్రీ . ఈ ప్రోమో బిగ్ బాస్ సీజన్ అన్నింట్లో బెస్ట్ ఎమోషనల్ ప్రోమో అని.. ప్రతి ఒక్కరి గుండెల్ని తాకిన ప్రోమో అని..శివాజీ సీజన్ 7 విన్నర్ అంటూ అంత కామెంట్స్ పెడుతున్నారు. మీరు కూడా ఈ ప్రోమో ఫై లుక్ వెయ్యండి.

Read Also : Rashmika : రష్మిక కు అండగా నిలబడ్డ చైతు..