బీబీనగర్‌లోని ఎయిమ్స్ (AIIMS – All India Institute of Medical Sciences) రాసలీలలకు అడ్డాగా మారింది. ఎయిమ్స్ (Aiims ) భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక ప్రఖ్యాత వైద్య విద్యా సంస్థ. ఇది తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పట్టణంలో ఉంది. AIIMS బీబీనగర్‌ను 2019లో ప్రధాని మోడీ (Modi) ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో, బీబీనగర్ ప్రాంతంలో 200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. AIIMS బీబీనగర్ కేవలం విద్యా సంస్థ మాత్రమే కాకుండా, అత్యాధునిక వైద్య సదుపాయాలను అందించే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా. అలాంటి హాస్పటల్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కనీసం అత్యవసర వైద్యం కూడా అందించలేని పరిస్థితిలో ఉంది. సాయంత్రం దాటింది అంటే బాధ్యత కలిగిన అధికారులు, డాక్టర్లు ఎవరు ఉండరు. ఇన్ పేషేంట్ లకు వైద్య విద్యార్థులే చికిత్స అందిస్తుంటారు. ఎంతో గొప్పగా చెప్పుకునే ఆసుపత్రిని పాలనాపరమైన అధికార యంత్రాంగం లేకనే సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షణలోనే రాత్రులు గడుస్తున్నాయి.
ఇదిలా ఉంటె..
మంగళవారం రాత్రి భువనగిరి నగరానికి చెందిన ఒక మహిళ అనారోగ్యంతో ప్లేట్స్ లెట్స్ తగ్గడంతో హుటాహుటిన బీబీనగర్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి చికిత్స కొరకు తీసుకొచ్చారు. చికిత్స పొందుతున్న క్రమంలో ఆమెకు సంబంధించిన బంధువులు బయట నిరీక్షిస్తుండగా హాలులో ఓ వ్యక్తి మహిళతో ఏకాంతంగా గడపడం చూసారు. వారు అర్ధనగ్న దుస్తులతో అలింగనం చేసుకుంటూ ముద్దులతో అసభ్యకరంగా ఉన్నారు. అంతలో ఒక వ్యక్తి సెల్ ఫోన్ లో జరుగుతున్న అశ్లీలతను చిత్రీకరించారు. అది గ్రహించిన సెక్యూరిటీ వచ్చి ఎందుకు తీస్తున్నావని హెచ్చరిస్తూ బెదిరించారు. సెక్యూరిటీ బెదిరింపులకు ఏమాత్రం బెదరకుండా సదరు వ్యక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం తో సెక్యూరిటీ సైలెంట్ అయ్యాడు.. ఇంతలో అక్కడికి వచ్చిన వైద్య విద్యార్థులు.. ‘మా దగ్గర డాక్టర్ విద్య పూర్తి చేసిన వారు అలానే ఉంటారని, ఇదంతా సహజమే’ అని చెప్పడం తో షాక్ అయ్యారు. మీ సెల్ఫోన్లో చిత్రీకరించినది డిలీట్ చేసి సారీ చెప్పండి అంటూ హెచ్చరించగా.. పేషెంట్స్ బంధువులు మేము ఎందుకు సారీ చెప్పాలి.. జరిగినదే కదా, మేము చిత్రీకరించాం అని ఎదురు తిరగడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. దీనిని బట్టి చూస్తే ఎయిమ్స్ లో సాయత్రం అయితే..రాసలీలకు అడ్డంగా మారుతుందని ఈ ఘటన తో రుజువైందని అంత మాట్లాడుకుంటున్నారు.
Read Also : Kollu Ravindra : జగన్..నీతులు చెప్పేందుకు సిగ్గుండాలి – కొల్లు రవీంద్ర