Site icon HashtagU Telugu

Ola Aabuse: ఓలా రైడ్ క్యాన్సిల్ చేసినందుకు యువతిని కొట్టిన ఆటో డ్రైవర్

Ola Aabuse

Ola Aabuse

Ola Aabuse: బెంగళూరులో ఓలా డ్రైవర్ రెచ్చిపోయాడు. రైడ్ క్యాన్సల్ చేసినందుకు మహిళ అని కూడా చూడకుండా ఆమెతో దుర్భాషలాడాడు. దీంతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

బెంగుళూరులో ఓలాతో కనెక్ట్ అయి ఉన్న ఓ ఆటో డ్రైవర్ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం అందించింది. ఆమె చెప్పిన కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయనగరం సబ్ డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ బాధితురాలికి హామీ ఇచ్చారు.రైడ్ రద్దు చేయడంతో ఓలా డ్రైవర్ తనపై దాడికి పాల్పడ్డాడని యువతీ ఫిర్యాదులో పేర్కొంది.

పీక్ అవర్స్ కారణంగా బాధితురాలు, ఆమె స్నేహితుడు రెండు ఆటోలు బుక్ చేసుకున్నారు. తన స్నేహితురాలి కారు ముందుగా రావడంతో బాధితురాలు తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని తన ఫ్రెండ్ కారులో ఎక్కింది. మరో ఆటో డ్రైవర్ ఆమెను వెంబడించి ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపి ఆగ్రహంతో అరుస్తూ దుర్భాషలాడాడు. ఆటో డ్రైవర్ మాపై దాడి చేసి దుర్భాషలాడాడు. నేను రికార్డింగ్ చేస్తుండగా అతను మరింత కోపోద్రిక్తుడై దుర్భాషలాడాడని తెలిపింది. దీంతో పోలీసులను ఆశ్రయిస్తానని ఆమె చెప్పడంతో.. సరే వెళ్లి కంప్లైంట్ ఇచ్చుకో అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు ఆమె తెలిపింది. వైరల్ అవుతున్న వీడియోలో ఆటో డ్రైవర్‌ ఫోన్‌ లాక్కుంటూ కనిపించాడు. తనను చెప్పుతో కొట్టాడని బాధితురాలు ఆరోపించింది. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Mudra Loans: పీఎం ముద్రా యోజన.. వైర‌ల్ అవుతున్న ఫేక్ లెట‌ర్..!