Bear Follows Tiger: చిరుత పులిని ఫాలో అయిన ఎలుగుబంటి.. ఒకసారిగా వెనక్కి తిరగడంతో?

అడవిలో ఉండే భయంకరమైన జంతువులలో చిరుత పులి అలాగే ఎలుగుబంటి కూడా ఒకటి. సాధారణంగా ఎలుగుబంట్లు, అలాగే చిరుత పులులు రెండు

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 04:21 PM IST

అడవిలో ఉండే భయంకరమైన జంతువులలో చిరుత పులి అలాగే ఎలుగుబంటి కూడా ఒకటి. సాధారణంగా ఎలుగుబంట్లు, అలాగే చిరుత పులులు రెండు ఎదురు పడటం అన్నది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. పులి మాంసాహారి. ఎలుగుబంటి శాకాహారి. కొన్ని కొన్ని సార్లు వెలుగుబంటి మనుషుల వాసన పసిగట్టినప్పుడు మనిషిని చూసినప్పుడు మాంసాహారిగా మారిపోయి చంపి మరీ తింటూ ఉంటాయి. గతంలో ఎలుగుబంటి దాడిలో చాలామంది మనుషులు చనిపోయిన విషయం తెలిసిందే.

ఆ సంగతి పక్కన పెడితే ఎలుగుబంటి చిరుత పులి ఎదురైనప్పుడు రెండింటిలో ఏవో ఒకటి సైలెంట్ గా వాటి పని అవి చేసుకొని వెళుతూ ఉంటాయి. ఎక్కువగా ఎలుగుబంటి చిరుతదాడికి భయపడి పక్కకు తప్పుకుంటూ ఉంటాయి. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఒక చిరుత పులి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇంతలోనే ఒక ఎలుగుబంటి దానిని వెంబడిస్తూ దాని వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంది. ఆ చిరుత పులికి దగ్గరగా వెళ్ళగా ఆ చిరుత పులి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడడంతో వెంటనే ఎలుగుబంటి రెండు కాళ్లపై పైకి లేచి శరణు కోరుతున్నట్టుగా నిలబడుతుంది.

 

వెంటనే ఆ చిరుత పులి ఆ ఎలుగుబంటి ముందు కాళ్లు మోకరిల్లి కూర్చుంటుంది. దాంతో అటు ఇటు చూసిన ఆ ఎలుగుబంటి అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందుకు సంబంధించిన వీడియోని ఐఏఎస్ అధికారి రమేష్ పాండే షేర్ చేస్తూ.. ఈ పులి సన్యాసి అయివుండాలి లేదా ఆ ఎలుగుబంటికి కంటి చూపు తక్కువగా అయినా ఉంటుంది అంటూ క్యాప్షన్ను కూడా జోడించారు.