Auto Covered into Car : ముందు ఆటో వెనక కారు.. ఇంత టాలెంటెడ్ ఏంటో..!

ఇంతకీ ఆ వీడియో దేనికి సంబంధించినది అంటే ముందు ఆటో (Auto) వెనక కారు కలిగి ఉన్న వీడియో అదేంటి విచిత్రంగా అనుకోవచ్చు.

Published By: HashtagU Telugu Desk
Auto Converted Into Car Creativity Peaks

Auto Converted Into Car Creativity Peaks

Auto Covered into Car : కాదేది క్రియేటివిటీకి అనర్హం అనేలా కొందరు వారు చేసే పనుల వల్ల వారెవా ఏం టాలెంట్ గురూ అనిపించేస్తారు. అలాంటి వారిలో చాలామంది తాము చేయాలనుకున్న పనులు తమ దగ్గర ఉన్న పనులతో కావు అనుకుంటే అప్పుడే వారి బుర్రకి పని చెప్పి వారి కలలను సాకారం చేసుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి ఒక తెలివైన వ్యక్తి వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియో దేనికి సంబంధించినది అంటే ముందు ఆటో (Auto) వెనక కారు కలిగి ఉన్న వీడియో అదేంటి విచిత్రంగా అనుకోవచ్చు.

ఆ వీడియో చూస్తే మీకే సీన్ అర్ధమవుతుంది. కారు కొనాలనుకున్న వ్యక్తి తన దగ్గర ఉన్న ఆటోనే కారులా మార్చుకున్నాడు. ఏదో పనికిరాని కారు వెనక భాగాన్ని తన ఆటోకి (Auto) అమర్చి వెనక నుంచి అది కారే అనిపించేలా చేశాడు. అయితే వీడియోలో ఆ కారు కాస్త ముందు కెళ్తే ఆటోగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చాలామందిని ఎంటర్టైన్ చేస్తుంది. కానీ అతను తన కలను నెరవేర్చుకునేందుకు ఇలా చేశాడని చెప్పొచ్చు.

ఆటో (Auto) ని కారుగా అతను మార్చిన తీరుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సొంత కారు కొనడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదు అసలు సొంత కారు కొన్నా నలుగురితో నారాయణ అన్నట్టు ఉంటుంది కానీ ఆటోని కారుగా మార్చాడు కాబట్టే అతను సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. ఇలాంటి చిత్ర విచిత్రమైన వీడియోలన్నీ కూడా ఖాళీగా ఉన్న వారు బాగా వైరల్ చేసేస్తారు.

ఆటో నడిపే అతని టాలెంట్ చూసి చాలామంది ఏం టాలెంటెడ్ రాజా నీది అనేస్తున్నారు. సోషల్ మీడియా స్పేస్ లో ఇలాంటి వీడియోలు ఇలా పెట్టగానే అలా వైరల్ అవుతాయి. వెనక నుంచి కారులా ముందుకెళ్తే ఆటోలా కనిపించే ఈ వైరల్ వీడియో కూడా సోషల్ మీడియా లో తెగ చెక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన వారంతా కూడా ఇంత టాలెంట్ ఇండియాలోనే ఉంటుందని అనుకుంటున్నారు.

Also Read:  Bigg Boss 7 : ప్రిన్స్ యావర్ ఓవర్ కాన్ ఫిడెంట్ అయ్యాడా..?

  Last Updated: 18 Sep 2023, 09:03 PM IST