Attack On Aggipetti Macha : తిరుపతిలో అగ్గిపెట్టె మచ్చా పై దాడి

Attack On Aggipetti Macha : మచ్చా బార్ దగ్గర మత్తులో ఉన్న అగ్గిపెట్టె మచ్చా బూతులు తిడుతూ..నానా హంగామా చేయడంతో అక్కడ ఉన్న కొంతమంది యువకులు ఆగ్రహంతో అతడిపై దాడి చేసారు

Published By: HashtagU Telugu Desk
Attack On Aggipetti Macha

Attack On Aggipetti Macha

తిరుపతిలోని అమెరికన్ బార్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోషల్ మీడియా సెన్సేషన్ అగ్గిపెట్టె మచ్చా(Attack On Aggipetti Macha)పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసారు. మచ్చా బార్ దగ్గర మత్తులో ఉన్న అగ్గిపెట్టె మచ్చా బూతులు తిడుతూ..నానా హంగామా చేయడంతో అక్కడ ఉన్న కొంతమంది యువకులు ఆగ్రహంతో అతడిపై దాడి చేసారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు ఆ దాడిని అడ్డుకొని అగ్గిపెట్టె మచ్చా కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించినట్లు సమాచారం.

అగ్గిపెట్టె మచ్చా (Aggipetti Macha) సోషల్ మీడియా లవర్స్ కు సుపరిచితమే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, వింతగా ఉండే వీడియోలు మరియు ఫన్నీ కంటెంట్ ద్వారా ప్రజలకి దగ్గరయ్యాడు. తనదైన శైలిలో బూతులు తిడుతూ..నవ్వించడం ఆయన ప్రత్యేకత. ఈ ప్రత్యేకతే ఆయన్ను పాపులర్ చేసింది. మచ్చా తన వినోదానికి తోడు కొన్ని వివాదాస్పద సందర్భాల్లోనూ ఉండడం వలన, కొన్ని సందర్భాలలో వివాదాల్లో నిలిచాడు. తాజాగా తిరుపతిలో అమెరికన్ బార్ వద్ద జరిగిన ఘటన కూడా అలాంటి వివాదమే.

Read Also : Tirumala : తిరుమల క్షేత్రంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అవమానం..?

  Last Updated: 23 Oct 2024, 01:17 PM IST