Site icon HashtagU Telugu

Tunisia: దారుణం.. పడవ మునిగిపోయి 20 మందికి పైగా వలసదారులు గల్లంతు.. ఎక్కడంటే?

Tunisia

Tunisia

ఈ మధ్యకాలంలో ట్యూనీషియా తీరంలో పడవ ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఆఫ్రికా నుంచి దొంగ చాటుగా బతుకు తెరువు కోసం ఇటలీతో పాటు ఇతర యూరోప్ దేశాలకు వలస వెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఆఫ్రికా మధ్య ప్రాచ్య దేశాల్లో ఆకలికేకలు, నిత్యం సంఘర్షణల కారణంగా అక్కడి ప్రజలు ట్యూనీషియా, లిబియా నుంచి యూరప్ వెళుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది వలసదారులు గల్లంతయ్యారు. కొంతమందిని రక్షిస్తుండగా మరి కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా దొరకడం లేదు.

అయితే మంచి జీవితం కోసం యూరప్ వలస వెళుతున్నాం అనుకున్న వలసదారుల ఆశలు అడియాశలు అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా మధ్యధరా సముద్రంలో ట్యూనీషియా తీరంలో పడవ మునిగిపోవడంతో దాదాపు 20 మందికి పైగా వలసదారులు గల్లంతయ్యారు. ఆఫ్రికా నుంచి మధ్యధరా సముద్రం మీదగా ఇటలీ వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో ట్యూనీషియా తీరంలో ఇలాంటి ఘటనలు చాలా చోటుచేసుకున్నాయి. అక్కడ దాదాపు 23 మంది ఆఫ్రికన్ వలసదారులు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు.

తాజాగా శనివారం రోజున రెండు పడవలు ట్యూనీషియా నుండి మధ్యధరాసముద్రం దాటి ఇటలీ వెళ్ళిందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మునిగిపోవడంతో నలుగురు అక్కడికక్కడే మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే గల్లంతయిన వారిని వెతికే పనిలో పడినట్లు అధికారులు తెలిపారు. వారి కోసం వేటనీ కొనసాగిస్తున్నారు. అయితే రక్షించిన వారిలో కూడా చాలామంది మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. కోస్ట్ గార్డ్ మరో 53 మందిని రక్షించగా వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.