Vande Bharat : వందేభారత్ రైల్లో ప్రయాణిస్తున్నారా..? అయితే గొడుగు వెంటపెట్టుకోండి..

ప్రయాగ్‌రాజ్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ట్రైన్ లోని ఓ భోగి కురవడంతో అందులోని ప్రయాణికులంతా తడిసిముద్దయ్యారు

  • Written By:
  • Publish Date - June 29, 2024 / 01:31 PM IST

అదేంటి అనుకుంటున్నారా..? ట్రైన్ ప్రయాణం చేస్తే గొడుగు ఎందుకు వెంట పెట్టుకోవాలి అనుకుంటున్నారా..? ఎందుకంటే ప్రస్తుతం వర్షం కాలం కదా..ప్రతి రోజు వర్షం పడుతూనే ఉంటుంది. దీంతో తడవకుండా ఉండేందుకు గొడుగు పట్టుకొని వెళ్లాలని అని చెపుతున్నాం..ట్రైన్ లో వెళ్తే ఎలా తడుస్తాం అనే సందేహం కదా..ఎందుకంటే ట్రైన్లు కూడా కురుస్తున్నాయి కాబట్టి..అదేదో చిన్న చితక ట్రైన్ కూడా కాదు కేంద్ర సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ట్రైన్ (Vande Bharat Express) లో ఈ ఘటన చోటుచేసుకుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవల కాలంలో కేంద్రం ఎంతో భారీ వ్యయం తో నిర్మించిన కట్టడాలన్నీ కూడా భారీ వర్షాలకు కురుస్తున్నాయి. కూలుతున్నాయి. మొన్న అయోధ్య ఆలయం.. నిన్న ఎయిర్ పోర్టు, వంతెనలు, నేడు వరల్డ్ క్లాస్ వందేభారత్ రైలు ఇలా అన్ని కూడా వర్షానికి కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్న భయం ..భయంతో వెళ్తున్నారు. అయోధ్యలో కురిసిన చిన్నపాటి వర్షానికి గర్భగుడిలోకి నీళ్లొచ్చాయి. అంతేనా?.. ఆ తర్వాత కురిసిన వర్షాలకు టెంపుల్ టౌన్ కాస్తా మునిగిపోయింది. మోకాళ్ల లోతు నీటిలో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బీహార్‌లో కొద్దిపాటి వర్షాలకే వంతెనలు పేకమేడల్లా కుప్పకూలుతున్నాయి. ఒకటి , రెండు కాదు 11 రోజులల్లో ఏకంగా ఐదు వంతెనలు కుప్పకూలాయంటే అర్ధం చేసుకోవాలి కేంద్రం ఎంత నాణ్యతతో కట్టిస్తుందో..ఇక మొన్న ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 రూఫ్ కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పదుల సంఖ్యలో వాహనాలు దెబ్బతిన్నాయి.

ఇక ఇవే అనుకుంటే ఇప్పుడు నేను ఏమైనా తక్కువనా అన్నట్లు వందేభారత్ ట్రైన్ కూడా వర్షానికి కురవడం స్టార్ట్ చేసింది. ప్రయాగ్‌రాజ్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ట్రైన్ లోని ఓ భోగి కురవడంతో అందులోని ప్రయాణికులంతా తడిసిముద్దయ్యారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఉహించుకోలేదని ఇది మోడీ సర్కార్ కాదు లీకేజీ సర్కార్ అంటూ వారంతా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. అందుకే మీరు కూడా వందే భారత్ ట్రైన్ ప్రయాణం చేస్తే గొడుగు తీసుకొని వెళ్ళండి.

Read Also : Future PM : ‘కాబోయే ప్రధానమంత్రి అఖిలేష్’.. పోస్టర్లపై పొలిటికల్ చర్చ