Site icon HashtagU Telugu

Viral Video: తేనెటీగలు కూడా చెప్పినట్టు – ‘అన్నా, నీవే తేనె తీసుకో!’ ఇది మామూలు దృశ్యం కాదు!

Bees And Honey

Bees And Honey

Viral Video: సోషల్ మీడియా లో అబ్బురపరిచే వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తేనెటీగల చుట్టు జాగ్రతలేవి లేకుండా, భయపడకుండా తేనె తీయడం కనిపిస్తోంది. అంతే కాకుండా, ఆ వ్యక్తిని ఒక్క తేనెటీగ కూడా కుట్టడం లేదు.

వీడియోలో అతను ప్రశాంతంగా తేనెటీగల గూడు వద్దకు వెళ్లి, తేనెను మెల్లగా తీస్తున్నాడు చుట్టూ తేనెటీగలు అలుముకుంటున్నప్పటికీ, ఏవీ అతనిపై దాడి చేయవు

ఈ దృశ్యం చూసినవారు ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది ఇది ఆ వ్యక్తి ప్రత్యేక నైపుణ్యం అయి ఉండొచ్చు అంటున్నారు, మరికొందరు అతని ప్రకృతితో ఉన్న అనుబంధం వల్ల ఇలా జరిగిందని అంటున్నారు.

ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది చూశారు, షేర్ చేస్తున్నారు, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.