Site icon HashtagU Telugu

MLA Attack : అధికారిపై ఎమ్మెల్యే దాడి! వీడియో హ‌ల్ చ‌ల్‌

Gadwal Mla

Gadwal Mla

ప్ర‌భుత్వ అధికారి చొక్కా ప‌ట్టుకుని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చ‌ల్లా కృష్ణా రెడ్డి దూషించిన వీడియో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఓ కార్యక్రమానికి ఆలస్యంగా ఆహ్వానించినందుకు ఆగ్ర‌హించిన‌ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అధికారిపై ఆగ్ర‌హించారు.

ప్రభుత్వ గురుకుల పాఠశాలల రీజనల్‌ కో-ఆర్డినేటర్‌గా ఉద్యోగి కాలర్‌ పట్టుకున్నారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. అదే దృశ్యం ఆ వీడియోలో కనిపిప్తోంది. పాఠశాలను ఎమ్మెల్యే ప్రారంభించాలని అనుకున్నార‌ట‌. అయితే ఎమ్మెల్యే రాకముందే జిల్లా పరిషత్‌ చైర్మన్ దాన్ని ప్రారంభించినట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారిని కాలర్‌ పట్టుకున్నారు.

జోగులాంబ గద్వాల్ పోలీస్ సూపరింటెండెంట్ రంజన్ రథన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఇంకా ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూశామని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.