Site icon HashtagU Telugu

Anand Mahindra: ఆనంద్‌ మహీంద్ర వీడియో షేర్‌… ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లేని రహదారి అంటూ కామెంట్‌!

26022023 Anandmahindra I

26022023 Anandmahindra I

Anand Mahindra: అత్యవసర సమయాల్లో అత్యంత చిరాకు తెప్పించే అంశం ట్రాఫిక్‌. ప్రధాన నగరాల్లో అయితే ఆ బాధ చెప్పనక్కర్లేదు. అదే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లేని రహదారి ఉంటే.. ఊహించుకుంటేనే గాల్లో తేలినట్టుంది కదూ. అలా ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లేని ఓ అద్భుతమైన రోడ్డు డిజైన్‌కు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా నెటిజన్లకు పరిచయం చేశారు.

దేశంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ పెరిగిపోతోంది. మహా నగరాల్లో అయితే అమ్మో.. గంటల తరబడి టైం వేస్ట్‌ అవుతోంది. ఇక అత్యవసర సమయాల్లో అయితే చాలా కష్టం. మనం గమ్యస్థానానికి చేరుకోవాలంటే ఇంటి దగ్గర ఒక్కోసారి గంట లేదా రెండు గంటల ముందే బయలు దేరాల్సి వస్తుంది. సగం టైమ్‌ మొత్తం ట్రాఫిక్‌లోనే పోతుంది. రద్దీనే అనుకుంటే మధ్యమధ్యలో వచ్చే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ సహనాన్ని పరీక్షిస్తుంటాయి. అదే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లేని రహదారి ఉంటే బాగుంటుందని అప్పుడప్పుడు కలలో ఊహిస్తుంటారు. ఇప్పుడు అలాంటిదే ఓ వీడియోను ఆనంద్‌ మహీంద్ర పోస్ట్‌ చేశారు. ఇప్పుడు అది వైరల్‌గా మారింది.

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ లేని ఓ అద్భుతమైన రోడ్డు డిజైన్‌కు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా నెటిజన్లకు పరిచయం చేశారు. వీడియోలో వాహనాలు ఎక్కడా ఆగకుండా తమ దారిలో అవి వెళ్తూ కనిపించాయి. వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా.. అద్భుతం.. యెమెన్ ఇంజనీర్ ముహమ్మద్ ఆవాస్ 2016లో అభివృద్ధి చేయబడింది. ఇది ‘హాఫ్ రౌండ్-అబౌట్స్‌’లను ఉపయోగించి ట్రాఫిక్ లైట్లు లేకుండా ట్రాఫిక్‌ను నిరంతరం నియంత్రిస్తుందంటూ రాసుకొచ్చారు. ఇదే సందర్భంలో ఈ విధానంలో ఎక్కువ ఇంధన వినియోగం ఉంటుందా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.